1
|
ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని |
2
|
ఇతడు బాప్తిస్మ మిచ్చు యోహాను; అతడు మృతులలోనుండి లేచి యున్నాడు; అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. |
3
|
ఏలయనగానీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, |
4
|
హేరోదు ఆమె నిమిత్తము యోహా నును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను. |
5
|
అతడు ఇతని చంప గోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను. |
6
|
అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను |
7
|
గనుకఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. |
8
|
అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదైబాప్తిస్మ మిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను. |
9
|
రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి |
10
|
బంట్రౌ తును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. |
11
|
వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను. |
12
|
అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతి పెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి. |
13
|
యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూ హములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి. |
14
|
ఆయన వచ్చి ఆ గొప్ప సమూహ మును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. |
15
|
సాయంకాలమైనప్పుడు శిష్యు లాయనయొద్దకు వచ్చిఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయ మని చెప్పిరి. |
16
|
యేసువారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా |
17
|
వారు ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి. |
18
|
అందు క ాయనవాటిని నాయొద్దకు తెండని చెప్పి |
19
|
పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. |
20
|
వారందరు తిని తృప్తిపొందిన తరు వాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి |
21
|
స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. |
22
|
వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయు నంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. |
23
|
ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయు టకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాల మైనప్పుడు ఒంటరిగా ఉండెను. |
24
|
అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్ట బడుచుండెను. |
25
|
రాత్రి నాలుగవ జామున ఆయన సము ద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను |
26
|
ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. |
27
|
వెంటనే యేసుధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా |
28
|
పేతురుప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. |
29
|
ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని |
30
|
గాలిని చూచి భయపడి మునిగిపోసాగిఒ ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. |
31
|
వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొనిఅల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. |
32
|
వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. |
33
|
అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. |
34
|
వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. |
35
|
అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి |
36
|
వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి. |
Matthew 14:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...