1
|
ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర....తీరమున కూర్చుండెను. |
2
|
బహు జనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుం డెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా |
3
|
ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగాఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. |
4
|
వాడు విత్తుచుండగా కొన్ని విత్తన ములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను |
5
|
కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని |
6
|
సూర్యుడు ఉదయించి నప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. |
7
|
కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి |
8
|
కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. |
9
|
చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. |
10
|
తరువాత శిష్యులు వచ్చినీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను |
11
|
పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు. |
12
|
కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియువారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. |
13
|
ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించు చున్నాను.ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి |
14
|
మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు |
15
|
గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది. |
16
|
అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. |
17
|
అనేక ప్రవక్తలును నీతిమంతు లును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. |
18
|
విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. |
19
|
ఎవడైనను రాజ్య మునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. |
20
|
రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. |
21
|
అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. |
22
|
ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. |
23
|
మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను. |
24
|
ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగాపరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది. |
25
|
మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. |
26
|
మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. |
27
|
అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా,అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. |
28
|
ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. |
29
|
అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. |
30
|
కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు ననెను. |
31
|
ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. |
32
|
అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించు నంత చెట్టగును. |
33
|
ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. |
34
|
నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడినసంగతులను తెలియజెప్పెదను |
35
|
అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగ తులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు. |
36
|
అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటి లోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిపొలము లోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి. |
37
|
అందుకాయన ఇట్లనెనుమంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; |
38
|
పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు1; గురుగులు దుష్టుని సంబంధులు1; |
39
|
వాటిని విత్తిన శత్రువు అపవాది2; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు. |
40
|
గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును. |
41
|
మనుష్యకుమా రుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. |
42
|
అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. |
43
|
అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక. |
44
|
పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగిన దంతయు అమి్మ ఆ పొలమును కొనును. |
45
|
మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. |
46
|
అతడు అమూల్య మైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగిన దంతయు అమి్మ దాని కొనును. |
47
|
మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. |
48
|
అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయు దురు. |
49
|
ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవ దూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, |
50
|
వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. |
51
|
వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడు గగా వారుగ్రహించితి మనిరి. |
52
|
ఆయనఅందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థ ములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నా డని వారితో చెప్పెను. |
53
|
యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి, సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. |
54
|
అందువలన వారాశ్చర్యపడిఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి? |
55
|
ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? |
56
|
ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. |
57
|
అయితే యేసుప్రవక్త తన దేశము లోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. |
58
|
వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. |
Matthew 13:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...