1
|
ఆయన తన శిష్యులతో ఇట్లనెను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యముకాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ. |
2
|
వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరు గటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. |
3
|
మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహో దరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము. |
4
|
అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగిమారుమనస్సు పొందితి ననినయెడల అతని క్షమింపవలెననెను. |
5
|
అపొస్తలులుమా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా |
6
|
ప్రభువుమీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచినీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. |
7
|
దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చి నప్పుడునీవు ఇప్పడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. |
8
|
అంతేకాకనేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధ పరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చు కొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ |
9
|
ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసి నందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? |
10
|
అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాతమేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను. |
11
|
ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్లుచుండెను. |
12
|
ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి |
13
|
యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. |
14
|
ఆయన వారిని చూచిమీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లు చుండగా, శుద్ధులైరి. |
15
|
వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి |
16
|
గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు. |
17
|
అందుకు యేసుపదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? |
18
|
ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి |
19
|
నీవు లేచిపొమ్ము, నీ విశ్వా సము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను. |
20
|
దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయనదేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. |
21
|
ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తర మిచ్చెను. |
22
|
మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెనుమనుష్య కుమారుని దినములలో ఒకదినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చునుగాని మీరు ఆ దినమును చూడరు. |
23
|
వారుఇదిగో యిక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల వెళ్లకుడి, వెంబడింప కుడి. |
24
|
ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి, ఆకాశముక్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును. |
25
|
అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను. |
26
|
నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. |
27
|
నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను. |
28
|
లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. |
29
|
అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను. |
30
|
ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్ష మగు దినమున జరుగును. |
31
|
ఆ దినమున మిద్దెమీద ఉండు వాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగ కూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. |
32
|
లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి. |
33
|
తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవ ముగా కాపాడుకొనును. |
34
|
ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును. |
35
|
ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్ట బడుననెను. |
36
|
శిష్యులు ప్రభువా, యిది ఎక్కడ (జరుగు) నని ఆయన నడిగినందుకు |
37
|
ఆయనపీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను. |
Luke 17:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...