Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Numbers Chapters

Numbers 30 Verses

Bible Versions

Books

Numbers Chapters

Numbers 30 Verses

1 మోషే ఇశ్రాయేలీయులయొక్క గోత్రాధిపతు లతో ఇట్లనెను
2 ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన యెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన యెడల, అతడు తన మాటతప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చ వలెను.
3 మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురా లైన యెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనిన యెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును.
4 ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును.
5 ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణచేసిన యెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టు కొనిన బాధ్యతలో ఏదియు నిలువక పోవును.
6 ఆమె తండ్రి దానికి ఆక్షేపణచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.
7 ఆమెకు వివాహమైన తరు వాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లయినను, నిరాలోచనగా ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమెమీద నుండుట ఆమె భర్త విని, దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన యెడల, ఆమె మ్రొక్కుబళ్లును ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును.
8 ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టు కొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.
9 విధవరాలుగాని విడనాడబడినదిగాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును.
10 ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కు కొనినయెడల నేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనిన యెడలనేమి,
11 తరువాత ఆమె భర్త విని దానిగూర్చి ఆక్షేపణచేయక ఊరకుండినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలు చును; ఆమె తనమీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును.
12 ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియు, ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువక పోవును; ఆమెభర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.
13 ప్రతి మ్రొక్కుబడిని, తన్ను తాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్తస్థిరపరచ వచ్చును, రద్దుచేయవచ్చును.
14 అయితే ఆమె భర్త నానాట దానిగూర్చి ఊరకొనుచు వచ్చినయెడల, వాడు ఆమె మీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటిని ఆమె ఒట్టులన్నిటిని స్థిరపరచినవాడగును. అతడు వినిన దినమున దానిగూర్చి ఊరకుండుటవలన వాటిని స్థిరపరచెను.
15 అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దుచేసినయెడల, తానే ఆమె దోష శిక్షను భరించును.
16 ఇవి భర్తను గూర్చియు, భార్యనుగూర్చియు, తండ్రినిగూర్చియు, బాల్యమున తండ్రి యింట నున్న కుమార్తెనుగూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.

Numbers 30:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×