Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Numbers Chapters

Numbers 16 Verses

Bible Versions

Books

Numbers Chapters

Numbers 16 Verses

1 లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీ యాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని
2 ఇశ్రాయేలీయు లలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి
3 మోషే అహరోనులకు విరోధముగా పోగుపడిమీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,
4 మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను
5 తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును.
6 ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి.
7 అప్పుడు యెహోవా యే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు.
8 మరియు మోషే కోరహుతో ఇట్లనెనులేవి కుమారులారా వినుడి.
9 తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా?
10 ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.
11 ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజ మును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.
12 అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను.
13 అయితే వారుమేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంప వలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా?
14 అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి.
15 అందుకు మోషే మిక్కిలి కోపించినీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొన లేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవిచేసెను.
16 మరియు మోషే కోరహుతొ నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను.
17 మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.
18 కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్ని యుంచి వాటిమీద ధూప ద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి.
19 కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధ ముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజ మునకు కనబడెను.
20 అప్పుడు యెహోవామీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్లుడి.
21 క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా
22 వారు సాగిలపడిసమస్త శరీరాత్మలకు దేవుడ వైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడు కొనిరి.
23 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
24 కోరహు దాతాను అబీరాములయొక్క నివాస ముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.
25 అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.
26 అతడుఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగి పోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.
27 కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసములయొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి.
28 మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు.
29 మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్నుపంప లేదు.
30 అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.
31 అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను.
32 భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
33 వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళ ములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.
34 వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష వినిభూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి.
35 మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణ మును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.
36 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెనునీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలి యాజరుతో ఇట్లనుముఆ అగ్నిమధ్యనుండి ఆ ధూపార్తు లను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి.
37 ఆ అగ్నిని దూర ముగా చల్లుము.
38 పాపముచేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసికొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠిత మైనవి; అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును.
39 అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి,
40 కోరహువలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకసూచనగా ఉండుటకై యాజకు డైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన యిత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులు చేయించెను.
41 మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచుమీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి
42 సమాజము మోషే అహరోను లకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారమువైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను; యెహోవా మహిమయు కనబడెను.
43 మోషే అహ రోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా
44 యెహోవామీరు ఈ సమాజము మధ్యనుండి తొలగి పోవుడి,
45 క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి.
46 అప్పుడు మోషేనీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా
47 మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయ శ్చిత్తము చేసెను.
48 అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను.
49 కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి.
50 ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను.

Numbers 16:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×