1
|
మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీ నిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. |
2
|
వారుమోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా |
3
|
యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. |
4
|
యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా |
5
|
యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. |
6
|
వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకు డైన మోషే అట్టివాడుకాడు. |
7
|
అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. |
8
|
నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధ ముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను. |
9
|
యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను. |
10
|
మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్త బడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. |
11
|
అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము; పాపులమైన మేము చేసిన యీ పాప మును మామీద మోపవద్దు. |
12
|
తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా |
13
|
మోషే యెలుగెత్తిదేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱ పెట్టెను. |
14
|
అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమి్మవేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను. |
15
|
కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి. |
16
|
తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. |
Numbers 12:12 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...