Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Genesis Chapters

Genesis 5 Verses

Bible Versions

Books

Genesis Chapters

Genesis 5 Verses

1 ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
2 మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
3 ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
4 షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
5 ఆదాము బ్రదికిన దిన ములన్నియు తొమి్మదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
6 షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.
7 ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
8 షేతు బ్రదికిన దిన ములన్నియు తొమి్మదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
9 ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
10 కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
11 ఎనోషు దినములన్నియు తొమి్మదివందల అయి దేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
12 కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.
13 మహలలేలును కనినతరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
14 కేయినాను దినములన్నియు తొమి్మదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
15 మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.
16 యెరెదును కనినతరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
17 మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
18 యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.
19 హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
20 యెరెదు దినములన్నియు తొమి్మదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
21 హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.
22 హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తె లను కనెను.
23 హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.
24 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
25 మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.
26 మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
27 మెతూషెల దినములన్నియు తొమి్మదివందల అరువది తొమి్మదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
28 లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమా రుని కని
29 భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు
30 లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
31 లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
32 నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.

Genesis 5:18 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×