“నాకు కానుకలు తీసుకు రమ్మని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. నాకు ఇవ్వాల్సింది ఏమిటి? ప్రతి మనిషి తన హృదయంలో తీర్మానించుకోవాలి. నా కోసం ఈ కానుకల్ని స్వీకరించు.
దీపాలకు నూనె, ధూపం. ప్రత్యేక అభిషేక తైలానికి [*అభిషేక తైలానికి శుద్ధమైన ఒలీవ తైలం ప్రత్యేక కార్యక్రమాల కోసం ఒక వ్యక్తి రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా ఏర్పాటు చేయబడినప్పుడు సాధారణంగా ఈ నూనె ఆ వ్యక్తి తలమీద పోయబడుతుంది.] సువాసన చేకూర్చే పరిమళ వస్తువులు,
ఇంకా లేత పచ్చరాళ్లు, ఏఫోదు [†ఏఫోదు పూర్వం ఇశ్రాయేలీ యాజకులు ధరించే ఒక ప్రత్యేక అంగీ లేక కోటు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పన్నెండు ప్రశస్తమైన రాళ్లు దానిమీద బంగారుతో పొదగబడుతాయి. ఊరీం, తుమ్మీమ్ దానిలో ఉంచబడతాయి.] మీద లేక న్యాయ తీర్పుపై వస్త్రం మీద పొదిగించడానికి విలువైన రాళ్లు.”
పవిత్ర గుడారం ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. దానిలో ఏమేమి వస్తువులు ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. సరిగ్గా నేను నీకు చూపించినట్టు ఒడంబడిక పెట్టె తయారు చెయ్యి.
దేవుడు అన్నాడు: “నేను ఒడంబడికను [‡ఒడంబడికను సాక్ష్యం, రుజువు, పది ఆజ్ఞలు రాసిన రాతి పలకలు. దేవునికి, ఇశ్రాయేలీయులకు మధ్య ఒడంబడికకు యిది రుజువు.] నీకు ఇస్తాను. ఆ ఒడంబడికను ఈ పెట్టెలో పెట్టు.
ఆ పెట్టెకు ఒక మూత [§మూత కరుణాపీఠం అని కూడ పిలువబడుతుంది. మూత అనీ పాపాలు క్షమించే స్థానం అని కూడ దీని హీబ్రూ పదానికి అర్థం.] చెయ్యాలి. స్వచ్ఛమైన బంగారంతో దీన్ని చెయ్యాలి. 45 అంగుళాల పొడవు 27 అంగుళాల వెడల్పుతో దీన్ని చెయ్యాలి.
కెరూబులు ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉండాలి. ఆ దూతల ముఖాలు మూత వైపుకు చూస్తూ ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు మూతను అవరించి ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు ఆకాశం వైపు ఎత్తబడి ఉండాలి.
నేను నిన్ను కలుసుకొనేటప్పుడు ఆ ఒడంబడిక పెట్టె ప్రత్యేక మూత మీద ఉన్న కెరూబు దూతల మధ్యనుండి నేను మాట్లాడుతాను. అక్కడినుండే నేను నా ఆజ్ఞలన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలకు యిస్తాను.
ప్రత్యేకమైన రొట్టెను [*ప్రత్యేకమైన రొట్టె సన్నిధి రొట్టె అని కూడ పిలువబడింది. పవిత్ర స్థలంలో దేవుని యెదుట ప్రతిరోజూ ఈ రొట్టెను ఉంచాలి.] నా యెదుట బల్ల మీద పెట్టాలి. అవి నా యెదుట ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి.
“అప్పుడు నీవు ఒక దీపస్తంభం చేయాలి. దీపస్తంభంలో ప్రతి భాగాన్నీ సాగకొట్టబడ్డ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. అందంగా కనబడేటట్టు దీపానికి పూలు చేయాలి. ఈ పూలలో మొగ్గలు, రేకులు స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. ఇవన్నీ దీప స్తంభంతోపాటు ఒకే వస్తువుగా కలిసి ఉండాలి.
కాండమునకు ఇరు ప్రక్కల మూడేసి కొమ్మల చొప్పున దీపస్తంభానికి ఆరు కొమ్మలు ఉండాలి. కొమ్మలు కాండంలో కలిసే మూడు చోట్లలో ఒక్కో దాని కింద మొగ్గలు, రేకులు గల ఒక పువ్వును చేయి.