Indian Language Bible Word Collections
Genesis 5:26
Genesis Chapters
Genesis 5 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Books
Old Testament
New Testament
Genesis Chapters
Genesis 5 Verses
1
|
ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను; |
2
|
మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. |
3
|
ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. |
4
|
షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను. |
5
|
ఆదాము బ్రదికిన దిన ములన్నియు తొమి్మదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. |
6
|
షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను. |
7
|
ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. |
8
|
షేతు బ్రదికిన దిన ములన్నియు తొమి్మదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. |
9
|
ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను. |
10
|
కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. |
11
|
ఎనోషు దినములన్నియు తొమి్మదివందల అయి దేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. |
12
|
కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను. |
13
|
మహలలేలును కనినతరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. |
14
|
కేయినాను దినములన్నియు తొమి్మదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. |
15
|
మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను. |
16
|
యెరెదును కనినతరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. |
17
|
మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. |
18
|
యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను. |
19
|
హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. |
20
|
యెరెదు దినములన్నియు తొమి్మదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. |
21
|
హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను. |
22
|
హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తె లను కనెను. |
23
|
హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు. |
24
|
హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను. |
25
|
మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను. |
26
|
మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. |
27
|
మెతూషెల దినములన్నియు తొమి్మదివందల అరువది తొమి్మదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. |
28
|
లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమా రుని కని |
29
|
భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు |
30
|
లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. |
31
|
లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. |
32
|
నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. |