1
|
యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము. |
2
|
ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు. |
3
|
వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది. |
4
|
యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు. |
5
|
ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు. నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు. నా దారిలో వారు ఉచ్చు పెడతారు. |
6
|
యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. |
7
|
యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు. నీవు ఇనుప టొపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు. |
8
|
యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు. వారి పథకాలు నెగ్గనీయకు. |
9
|
యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము. ఆ మనుష్యులు చెడు కార్యాలు తల పెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చెయుము. |
10
|
వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము. నా శత్రువులను అగ్నిలో పడవేయుము. వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము. |
11
|
యెహోవా, ఆ అబద్దికులను బతుకనియ్యకుము. ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము. |
12
|
పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు. నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు. |
13
|
యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తాను. నీ సన్నిధానంలో వారు నివసిస్తారు. |
Psalms 140:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...