అతడు నాజీ రగుటకు మ్రొక్కు కొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.
తన దేవునికి మీదు కట్ట బడిన తలవెండ్రుకలు అతని తలమీద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరి గాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్ను తాను అప విత్రపరచుకొనవలదు.
అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవ దానితో దహన బలిని అర్పించి, వాడు శవము ముట్టుటవలన పాపి యైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి ఆ దిన మున వాని తలను పరిశుద్ధ పరపవలెను.
మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి.
గంపెడు పొంగని పిండి, అనగా గోధమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణ ముగా యెహోవాయొద్దకు తేవలెను.
మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రతసంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటి నుంచవలెను.
మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహో వాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.