1
|
యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెల విచ్చెను |
2
|
నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను |
3
|
ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయిం చుము. |
4
|
అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్య క్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా |
5
|
దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి |
6
|
దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. |
7
|
సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దాని మీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్ర లను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱ బట్ట పరచి |
8
|
దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. |
9
|
మరియు వారు నీలి బట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉప యోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి |
10
|
దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను. |
11
|
మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. |
12
|
మరియు తాము పరిశుద్ధస్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను. |
13
|
వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి |
14
|
దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను. |
15
|
దండు ప్రయాణమైనప్పుడు అహరో నును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్ని టిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధ మైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడా రములో కహాతీయుల భారము. |
16
|
యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగాదీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము. |
17
|
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను |
18
|
మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి. |
19
|
వారు అతి పరిశుద్ధమైనదానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియ మింపవలెను. |
20
|
వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. |
21
|
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను |
22
|
గెర్షోనీయులను వారివారి పితరుల కుటుంబముల చొప్పు నను వారివారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. |
23
|
ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనలో పని చేయ చేరువారందరిని లెక్కింప వలెను. |
24
|
పనిచేయు టయు మోతలు మోయుటయు గెర్షో నీయుల సేవ; |
25
|
వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడార మును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను |
26
|
మందిరము చుట్టును బలిపీఠము చుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధ మైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయ బడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను. |
27
|
గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయు వాటినన్నిటిని చేయు పనియంతటిని అహరోనుయొక్కయు అతని కుమారులయొక్కయు నోటిమాట చొప్పున జరుగ వలెను. వారు జరుపువాటి నన్నిటిని జాగ్రత్తగా చూచు కొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. |
28
|
ప్రత్యక్షపు గుడా రములో గెర్షోనీయులయొక్క పని యిది; వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతా మారు చేతిక్రింద నుండవలెను. |
29
|
మెరారీయులను వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. |
30
|
ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను. |
31
|
ప్రత్యక్షపు గుడార ములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డ కఱ్ఱలను దాని స్తంభము లను |
32
|
దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభము లను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావ లసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువు లను పేర్ల వరుసను లెక్కింపవలెను. |
33
|
మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహ రోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను. |
34
|
అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను, అనగా వారివారి వంశముల చొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని |
35
|
యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి. |
36
|
వారివారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది. |
37
|
ప్రత్యక్షపు గుడారములో సేవచేయ తగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటచొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. |
38
|
గెర్షోనీయులలో వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింప బడిన వారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని |
39
|
యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై సేనగా చేరువారందరు తమ తమ వంశముల చొప్పునను |
40
|
తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఆరు వందల ముప్పదిమంది. |
41
|
ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగినవారని గెర్షోనీయులలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా నోటిమాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. |
42
|
మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు |
43
|
అనగా ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్య క్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు |
44
|
అనగా తమ తమ వంశములచొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది. |
45
|
మెరారీ యుల వంశములలో లెక్కింపడినవారు వీరే; యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. |
46
|
మోషే అహరోనులు ఇశ్రాయేలీ యుల ప్రధానులును లెక్కించిన లేవీయులలొ |
47
|
ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు |
48
|
అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎని మిదివేల ఐదువందల ఎనుబదిమంది. |
49
|
యెహోవా నోటి మాట చొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతి వాడును తన తన సేవనుబట్టియు తన తన మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతనివలన లెక్కింపబడిరి. |
Numbers 4:34 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...