Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Matthew Chapters

Matthew 26 Verses

Bible Versions

Books

Matthew Chapters

Matthew 26 Verses

1 యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరు వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి
2 రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్ప గింపబడుననియు మీకు తెలియునని చెప్పెను.
3 ఆ సమయ మున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి
4 యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి.
5 అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లుపండుగలో వద్దని చెప్పుకొనిరి.
6 యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు,
7 ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను.
8 శిష్యులు చూచి కోపపడిఈ నష్టమెందుకు?
9 దీనిని గొప్ప వెలకు అమి్మ బీదల కియ్యవచ్చునే అనిరి.
10 యేసు ఆ సంగతి తెలిసి కొనిఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు?
11 బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతో కూడ ఉండను.
12 ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను.
13 సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నని వారితో అనెను.
14 అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి
15 నేనాయ నను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.
16 వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.
17 పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చిపస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడి గిరి.
18 అందుకాయనమీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లినా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతో కూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చె
19 యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.
20 సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుం డెను.
21 వారు భోజనము చేయుచుండగా ఆయనమీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
22 అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడునుప్రభువా, నేనా? అని ఆయన నడుగగా
23 ఆయననాతోకూడ పాత్రలో చెయ్యి ముంచినవా డెవడో వాడే నన్ను అప్పగించువాడు.
24 మనుష్యకుమా రునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవు చున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్ప గింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మను ష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.
25 ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.
26 వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.
27 మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి.
28 ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన1 రక్తము.
29 నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.
30 అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.
31 అప్పుడు యేసు వారిని చూచిఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగాగొఱ్ఱల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా.
32 నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెద ననెను.
33 అందుకు పేతురునీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా
34 యేసు అతని చూచిఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
35 పేతురాయనను చూచినేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగ నని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.
36 అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి
37 పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను.
38 అప్పుడు యేసుమరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండు డని వారితో చెప్పి
39 కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.
40 ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా?
41 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి
42 మరల రెండవమారు వెళ్లినా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి
43 తిరిగి వచ్చి, వారు మరల నిద్రిం చుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను.
44 ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను.
45 అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చిఇక నిద్రపోయి అలసట తీర్చు కొనుడి; ఇదిగో ఆ గడియవచ్చి యున్నది; మనుష్యకుమా రుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు;
46 లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి యున్నాడని వారితో చెప్పెను.
47 ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను.
48 ఆయనను అప్పగించువాడునేనెవ రిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి
49 వెంటనే యేసు నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.
50 యేసుచెలికాడా, నీవు చేయవచ్చి నది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.
51 ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను.
52 యేసునీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.
53 ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె1 ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?
54 నేను వేడుకొనిన యెడలఈలాగు జరుగ వలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.
55 ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబంది పోటుదొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయ ములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.
56 అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరు నట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యు లందరు ఆయనను విడిచి పారిపోయిరి.
57 యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.
58 పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయిదీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను.
59 ప్రధానయాజకు లును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని
60 అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.
61 తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చివీడు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి.
62 ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్య మేమని అడుగగా యేసు ఊరకుండెను.
63 అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసునీవన
64 ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వ శక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా
65 ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని--వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు;
66 మీకేమి తోచు చున్నదని అడిగెను. అందుకు వారువీడు మరణమునకు పాత్రుడనిరి.
67 అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమి్మవేసి, ఆయనను గుద్దిరి;
68 కొందరు ఆయనను అర చేతులతో కొట్టిక్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి.
69 పేతురు వెలుపటిముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చినీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను.
70 అందుకతడునేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను.
71 అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా
72 అతడు ఒట్టుపెట్టుకొనినేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.
73 కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చినిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.
74 అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను
75 కనుకకోడి కూయక మునుపు నీవు నన్నెరుగ నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను.

Matthew 26:44 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×