1
|
ఆ దినములలో, అనగా యూదావారిని యెరూష లేము కాపురస్థులను నేను చెరలోనుండి రప్పించు కాలమున |
2
|
అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశముల లోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యె మాడుదును. |
3
|
వారు నా జనులమీద చీట్లువేసి, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా? |
4
|
తూరు పట్టణమా, సీదోనుపట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నా కేమైన చేయుదురా? |
5
|
నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువు లను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి. |
6
|
యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరి హద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమి్మవేసితిరి; మీరు చేసినదానిని బహుత్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను. |
7
|
ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమి్మ పంపివేసిన ఆ యా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును |
8
|
మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమి్మవేయింతును; వారు దూరముగా నివ సించు జనులైన షెబాయీయులకు వారిని అమి్మవేతురు; యెహోవా సెలవిచ్చిన మాట యిదే. |
9
|
అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధు లందరు సిద్ధపడి రావలెను. |
10
|
మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గ ములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడునేను బలాఢ్యుడను అనుకొన వలెను. |
11
|
చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి. యెహోవా, నీ పరాక్రమ శాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము. |
12
|
నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను |
13
|
పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగి రండి. |
14
|
తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు. |
15
|
సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్ర ముల కాంతి తప్పిపోయెను. |
16
|
యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. |
17
|
అన్యు లికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరి శుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివ సించుచున్నానని మీరు తెలిసికొందురు. |
18
|
ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదు లన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిర ములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. |
19
|
ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును. |
20
|
ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును. |
21
|
అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సీయోనులో నివాసిగా వసించును. |
Joel 3:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...