1
|
“ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదాను, యెరూషలేమును నేను తిరిగి తీసికొని వస్తాను. |
2
|
రాజ్యలన్నింటిని కూడా నేను సమావేశ పరుస్తాను. ఈ రాజ్యలన్నిటిని క్రిందికి యెహోషా పాతు లోయలోకి నేను తిసుకొని వస్తాను. అక్కడ వారికి నేను తీర్పు చెప్తాను. ఆ రాజ్యా లు నా ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టాయి. వారు ఇతర రాజ్యాలలో జీవించేలా వారు వారిని బలవంత పెట్టారు. కనుక ఆ రాజ్యాలను శిక్షిస్తాను. ఆ రాజ్యాలు నా దేశాన్ని విభజించేశాయి. |
3
|
నా ప్రజల కొసం వారు చీట్లు వేసి కొన్నారు. ఒక వేశ్యను కొనేందుకు వారు ఒక బాలుని అమ్ముకొన్నారు. మరియు తాగడానికి ద్రాక్షా మద్యం కొనేందుకు వారు ఒక బాలికను అమ్ముకొన్నారు. |
4
|
“ తూరూ! సీ దోనూ! ఫిలిష్తీలోని అన్నిప్రాంతాలూ! మీరు నాకు ముఖ్యం కాదు. నేను ఏదైనా చేసినందుకు మీరు నన్ను శిక్షిస్తున్నారా? మీరు నన్ను శిక్షిస్తున్నారని తలస్తుండవచ్చు. కానీ త్వరలో నేను మిమ్మల్ని శిక్షిస్తాను. |
5
|
నా వెండి, బంగారం మీరు తీసుకొన్నారు. నా ప్రశస్త ఐశ్వర్యాలు మీరు తీసుకొని మీమీ ఆలయాలో పెట్టుకొన్నారు. |
6
|
“యూదా, యెరూషలేము ప్రజలను మీరు గ్రీకువాళకు అమ్మేశారు. ఆ విధంగా మీరు వారిని దేశానికి దూరంగా తీసికొని వె ళ్ళగలిగారు. |
7
|
మీరు నా ప్రజలను అంత దూరస్థలానికి పంపించి వేశారు. కానీ నేను వారిని వెనుకకు తీసికొని వస్తాను. మరియు మీరు చేసిన దానికి నేను మీమ్మల్ని శిక్షిస్తాను. |
8
|
మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు నేను అమ్మివేస్తాను. అప్పుడు వారు ఇంకా దూరంలో ఉన్న షెబాయీము ప్రజలకు అమ్మివేస్తారు.” ఆ విషయాలు యెహోవా చెప్పాడు. |
9
|
[This verse may not be a part of this translation] |
10
|
మీ నాగటి రేకులను చెడగొట్టి కత్తులు చేయండి. మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటెలు చేయండి. బలహీనుడ్ని కూడ “నేను బలాఢ్యుడను” అని చెప్పనీయండి. |
11
|
సకల రాజ్యాల్లారా, త్వరపడండి! ఆ స్థలానికికూడి రండి! యెహోవా, బలమైన నీ సైనికు లను తీసికొని రమ్ము. |
12
|
రాజ్యాల్లారా మేల్కొనండి. యెహోషాపాతు లోయలోనికి రండి. చుట్టు పక్కల రాజ్యాలన్నింటికీ తీర్పు చెప్పేందుకు అక్కడ నేను కూర్చుంటాను. |
13
|
పంట సిద్ధంగా ఉంది గనుక కొడవలి పట్టుకొనిరండి. రండి, ద్రాక్షా గానుగ నిండిపోయింది గనుక ద్రాక్షాపండ్ల మీద నడవండి. వారి దుర్మార్గం చాలాఉంది గనుక పీపాలు నిండిపోయి పొర్లిపోతాయి. |
14
|
తీర్మాన లోయలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. యెహోవా ప్రత్యేక దినం తీర్మాన లోయకు సమీపంగా ఉంది. |
15
|
సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి. నక్షత్రాలు ప్రకాశించడం మానివేస్తాయి. |
16
|
యెహోవా దేవుడు సీయోనులో నుండి కేకవేస్తాడు. యెరూషలేము నుండి ఆయన కేక వేస్తాడు. మరియు ఆకాశం, భూమి కంపిస్తాయి. కాని యెహోవా దేవుడే ఆయన ప్రజలకు క్షేమస్తానం. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన క్షేమస్థానంగా ఉంటాడు. |
17
|
“మీ యెహోవా దేవుడను నేనే అని అప్పుడు మీరు తెలుసుకొంటారు. నా పవిత్ర పర్వతమైన సీయోనులో నేను నివసిస్తాను. యెరుషలేము పవిత్రం అవుతుంది. పరాయి వారు ఆ పట్టణంలో నుండి మరల ఎన్నడూ దాటి వెళ్లరు.” |
18
|
“ఆ రోజున పర్వతాల నుండి తియ్యటి ద్రాక్షారసం కారుతుంది. కొండల్లో పాలు, తేనెలు ప్రవహిస్తాయి. మరియు యూదాలోని ఖాళీ నదులన్నిటిలో నీళ్ళు ప్రవహిస్తాయి. యెహోవా ఆలయంలోనుండి ఒక నీటీ ఊట చిమ్ముతుంది. అది షిత్తీము లోయకు నీళు ఇస్తుంది. |
19
|
ఈజిఫ్టు ఖాళీ అవుతుంది. ఎదోము ఖాళీ అరణ్యం అవుతుంది. ఎందుకంటే యూదా ప్రజలపట్ల వారు కృ఼రంగా ఉన్నారు. వారి దేశంలోని నిర్దోష ప్రజలను వారు చంపివేశారు. |
20
|
కాని యూదాలో మనుష్యులు ఎలప్పుడూ నివసిస్తారు. అనేక తరాల వరకు యెరూషలేములో మనుష్యులు నివసిస్తారు. |
21
|
ఆ మనుష్యులు చాలా మంది ప్రజలను చంపేశారు. కనుక ఆ ప్రజలను నేను నిజంగా శిక్షిస్తాను!” యెహోవా దేవుడు సీయోనులో నివసిస్తాడు. |
Joel 3:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...