Indian Language Bible Word Collections
Job 5:16
Job Chapters
Job 5 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Job Chapters
Job 5 Verses
1
|
నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్దదూతలలో ఎవనితట్టు తిరుగుదువు? |
2
|
దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశిం చెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు. |
3
|
మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమనికనుగొంటిని. |
4
|
అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురుగుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు. |
5
|
ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురుముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురుబోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి |
6
|
శ్రమ ధూళిలోనుండి పుట్టదు.బాధ భూమిలోనుండి మొలవదు. |
7
|
నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవము నకే పుట్టుచున్నారు. |
8
|
అయితే నేను దేవుని నాశ్రయించుదును.దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును. |
9
|
ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. |
10
|
ఆయన భూమిమీద వర్షము కురిపించువాడుపొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు. |
11
|
అట్లు ఆయన దీనులను ఉన్నతస్థలములలో నుంచునుదుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును. |
12
|
వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండఆయన వారి ఉపాయములను భంగపరచును |
13
|
జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనునుకపటుల ఆలోచనను తలక్రిందుచేయును |
14
|
పగటివేళ వారికి అంధకారము తారసిల్లునురాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్నకాలమునవారు తడువులాడుదురు |
15
|
బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలోనుండిఆయన దరిద్రులను రక్షించును. |
16
|
కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును. |
17
|
దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. |
18
|
ఆయన గాయపరచి గాయమును కట్టునుఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును. |
19
|
ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించునుఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. |
20
|
క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గబలమునుండియు ఆయన నిన్ను తప్పించును. |
21
|
నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయునుప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. |
22
|
పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని యుందువు అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును. |
23
|
ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవిమృగములకు నీవు ఏమాత్రమును భయపడవు |
24
|
నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండునునీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి యుండదు. |
25
|
మరియు నీ సంతానము విస్తారమగుననియునీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదురనియు నీకు తెలియును. |
26
|
వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లుపూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు. |
27
|
మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగే యున్నది. |