1
|
స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలిబాధనొందును. |
2
|
పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవునునీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. |
3
|
అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావుతీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించియున్నావు. |
4
|
పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగినఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు. |
5
|
నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలలసంఖ్య నీకు తెలిసేయున్నది.మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి యున్నావు |
6
|
కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకువారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము. |
7
|
వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియుదానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు. |
8
|
దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను |
9
|
నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చునులేత మొక్కవలె అది కొమ్మలు వేయును. |
10
|
అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు.నరులు ప్రాణము విడిచినతరువాత వారేమై పోవుదురు? |
11
|
తటాక జలములు ఎట్లు ఇంకిపోవునోనది నీరు ఎట్లు ఎండి హరించిపోవునోఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. |
12
|
ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు.ఎవరును వారిని నిద్ర లేపజాలరు. |
13
|
నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలునీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలునాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరు చున్నాను. |
14
|
మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకునా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును |
15
|
ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యు త్తరమిచ్చెదనునీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. |
16
|
అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావునా పాపమును సహింపలేకయున్నావు |
17
|
నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నదినేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు. |
18
|
పర్వతమైనను పడిపోయి నాశనమగునుకొండయైనను దాని స్థానము తప్పును. |
19
|
జలము రాళ్లను అరగదీయునుదాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవునునీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు. |
20
|
నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురునీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావు. |
21
|
వారి కుమారులు ఒకవేళ షునత వహించినను అదివారికి తెలియకపోవును.వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికిపట్టెనని వారు గ్రహింపకయుందురు. |
22
|
తమమట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురుతమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. |
Job 14:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...