తల్లి పాలు కుడిచేనాచిన్నారి తమ్ముడిలా నువ్వు చిట్టి పాపవే అయితే, నువ్వు నాకు బయట అగుపిస్తే, నిన్ను నేను ముద్దాడగలిగి ఉండేదాన్ని. అప్పుడు నన్నెవరూ తప్పు పట్టేవారు కారు!
నీ హృదయ పీఠం మీద నా రూపం ముద్రించు, నీ వేలికి ముద్రికలా ధరించు. మృత్యువంత బలమైనది ప్రేమ కోపాతిరేకం స్మశాననంతో సమమైనది. రోష విస్ఫులింగాలు జ్వాల అవుతాయి జ్వాలలు పెచ్చు మీరి మహాజ్వాల [*మహాజ్వాల అది యెహోవా కలుగజేసిన మహాజ్వాల.] అవుతాయి.
ఉప్పెన కూడా ప్రేమజ్వాలను ఆర్పజాలదునది జలాలూ ప్రేమను ముంచెత్తజాలవు. ఒకడు ప్రేమ కోసం తన సర్వస్వం ధరపోస్తే, అతణ్ణి ప్రజలు మూర్ఖుడిగా పరిగణించరు. ఎవడూ తప్పు పట్ట జాలడు!
అది ప్రాకారమైతే, దాని చుట్టూ వెండి నగిషీ [†వెండి నగిషీ లేక మోపు దుంగలు. తరచు కోట ప్రాకారాలకు దృఢత్వం కోసం దూలాలు అమరుస్తారు, అవి ధృడంగా ఉండటానికి దిమ్మలు కడతారు. కాని ఇక్కడ అలంకారాలు లేక నగిషీలు అనిపిస్తుంది.] చేస్తాము అది తలుపైతే, దాని చుట్టూ దేవదారు పలకలతో అంచులు అలంకరిస్తాము.
నేను ప్రాకారం వంటిదాన్ని నా వక్షోజాలు గోపుర ప్రాయాలు అతనికి నేనంటే తనివి, తృప్తి! [‡అతనికి నేనంటే తనివీ, తృప్తీ “అతని కళ్లలో నాకు శాంతి కానవస్తుంది” అని శబ్ధార్థం. హీబ్రూలో ఇది “సోలొమోను,” “షూలమ్మీతీ” అనే పదాలను కూడా స్ఫురింప జేస్తుంది.]
బయలు హామోనులో సొలొమోనుకొక ద్రాక్షాతోట ఉంది. ఆ తోటనాతడు కొందరు రైతులకు కౌలుకిచ్చాడు. వారిలో ఒక్కొక్క రైతు వెయ్యి వెండి షెకెళ్లు [§వెయ్యి వెండి షెకెళ్లు 25 పౌనులతో సమానం.] ఇచ్చాడు.
సొలొమోనూ, ఆ వెయ్యి షెకెళ్లూ నీ వే ఉంచుకో, వాటిలో యిన్నూరేసి ఒక్కొక్క రైతుకిచ్చేసెయ్యి అతుడు తెచ్చిన ద్రాక్షాలకు మింజువలె కానైతే, నా ద్రాక్షాతోట నా ఒద్దికలోనే ఉంటుంది!