Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Song of Solomon Chapters

Song of Solomon 1 Verses

Bible Versions

Books

Song of Solomon Chapters

Song of Solomon 1 Verses

1 (Song of Solomon ) సొలొమోను అత్యద్భుత గీతం
2 ముద్దులతో నన్ను ముంచెత్తు, ఎందుకంటే ద్రాక్షా మద్యంకన్నా బాగుంటుంది నీ ప్రేమ.
3 నీ పరిమళ ద్రవ్యం అద్భుతమైన సువాసననిస్తుంది, కాని మిక్కిలి ఉత్తమ పరిమళ ద్రవ్యం కన్నా నీ పేరు తియ్యనైనది. అందుకే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
4 నన్ను నీతో తీసికొనిపో! మనం పారిపోదాం పద! రాజు తన గదిలోనికి నన్ను తీసుకు పోయాడు. మేము ఆనందిస్తాం నీకోసం హాయిగా ఉంటాం. జ్ఞాపక ముంచుకో, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా బాగుంటుంది మంచి కారణంతోనే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
5 యెరూషలేము పుత్రికలారా, నేను నల్లగా అందంగా ఉన్నాను. కేదారు, సల్మా గుడారాలంత నల్లగా ఉన్నాను.
6 నేనెంత నల్లగా ఉన్నానో చూడవద్దు, సూర్యుడు నన్నెంత నల్లగా చేశాడో చూడవద్దు. నా సోదరులు నా మీద కోపగించారు. వాళ్ల ద్రాక్షా తోటలకు కాపలా కాయుమని నన్ను బలవంత పెట్టారు. అందువల్ల నన్ను గురించి నేను శ్రద్ధ తీసుకోలేక పోయాను .
7 నా ఆత్మ అంతటితోను నిన్ను ప్రేమిస్తాను! నీ గొర్రెల్ని ఎక్కడ మేపుతావో? మధ్యాహ్నం వాటిని ఎక్కడ పడుకో బెడతావో నాకు చెప్పు. నీతో ఉండటానికి నేను రావాలి లేదా నీ మిత్రుల గొర్రెల కోసం పాటుపడే అద్దెకు తీసుకున్న స్త్రీ అవుతాను!
8 నువ్వు అంత అందమైనదానవు! నిజంగా నీకు తెలుసు ఏమి చెయ్యాలో. వెళ్లు, గొర్రెలను అను సరించు. నీ చిన్న మేకల్ని గొల్లవాళ్ల గుడారాల వద్ద మేపు.
9 నా ప్రియులారా, ఫరోరథాలు లాగుతున్న మగ గుర్రాల్ని ఆకర్షించే ఆడ గుర్రం కన్నా నువ్వు నన్ను ఎక్కువ సంతోషపరుస్తున్నావు. ఆ గుర్రాలకు అందమైన అలంకరణలున్నాయి. వాటి ముఖాల పక్కన, వాటి మెడల చుట్టూ
10 [This verse may not be a part of this translation]
11 [This verse may not be a part of this translation]
12 నా పరిమళ ద్రవ్యపు సువాసన తన మంచంమీద పడుకున్న రాజును చేరుతుంది.
13 రాత్రంతా నా స్తనాల మధ్య పడివున్న నా మెడలోవున్న చిన్న గోపరసం సంచిలాంటి వాడు నా ప్రియుడు.
14 ఏన్గెదీ ద్రాక్షాతోటల దగ్గరున్న గోరంటు పూల గుత్తిలాంటివాడు నా ప్రియుడు.
15 నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఓహో! నువ్వు సుందరంగా ఉన్నావు! నీ కళ్లు పావురాల్లా వున్నాయి.
16 నా ప్రియుడా, నువ్వెంతో సొగసుగా ఉన్నావు! అవును, అత్యంత మనోహరంగా ఉన్నావు! మన శయ్య స్వచ్ఛంగా సంతోషకరంగా ఉంది
17 మనింటి దూలాలు దేవదారువి వాసాలు జాజి పలకలవి.

Song-of-Solomon 1:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×