1
|
అతిలోక సుందరి, ఎచ్చటికి వెళ్ళాడు నీ ప్రియుడు? ఏ దిక్కు కెళ్లాడు? నీ ప్రియుని మాకు తెలుపు వెదుకుటకు మేము నీకు తోడ్పడతాము. |
2
|
ఎర్రటి పద్మాలను ఏరుకొనుటకు నా ప్రియుడు వెళ్లాడు ఉద్యాన వనానికి సుగంధాలు వెదజల్లు పూలమొక్కల మళ్లకి గొర్రెల మేప పోయాడు తోటలకు కెందామరల కోసి రాశి వేయుటకు |
3
|
మేపు నా ప్రియుడు నావాడు నేనతనిదానను ఈనాడు ఏనాడు. నేను ఎర్రని పద్మాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను. |
4
|
ఓ నా ప్రియసఖీ, నీవు తిర్సా నగరమంత సుందర మైనదానివి, యెరూషలేమంత ఆహ్లాదకరమైన దానివి, నగర దుర్గాలంతటి భయంకరురాలివి . |
5
|
నీవు నా వైపు చూడకు! నీ చూపులు నన్ను పురికొల్పి ఉన్మత్తున్ని చేస్తాయి గిలాదు పర్వత చరియల నుండి గెంతులేస్తూ దిగివచ్చే గొర్రెపిల్లల మాదిరిగా నీ సుదీర్ఘ శిరోజాలు జాలువారు తున్నాయి. |
6
|
జోడు జోడు పిల్లల్ని కని ( వాటిలో ఏ ఒక్కటి పిల్లల్ని కోల్పోని) అప్పుడే శుభ్రంగా స్నానం చేసి వస్తున్న తెల్లటి ఆడ గొర్రెల బారులా ఉంది నీ పలువరుస |
7
|
బురఖా కింద నీ కణతలు దానిమ్మ చెక్కల్లా వున్నాయి. |
8
|
అరవై మంది రాణులు ఎనభై మంది సేవకురాండ్రు లెక్కకు మించిన కన్యలు ఉందురుగాక నాకు. |
9
|
కాని, నా గువ్వ పిట్ట నిష్కళంకురాలు ఒక్కతే (నాకైన స్త్రీ) ఆమె తన తల్లికి ముద్దుబిడ్డ. తన తల్లికి గారాల కూచి! కన్యలే ఏమి, రాణులు,సేవకు రాండ్రు కూడా ఆమెను చూచినంతనే ప్రశంసిస్తారు. |
10
|
ఎవరా యువతి? అరుణోదయంలా మెరుస్తోంది. చంద్రబింబమంత అందమైనది సూర్యుడంత ధగ ధగలాడుతోంది, పరలోక సేనకులంతటి విభ్రాంతి గొలుపు ఆ యువతి ఎవరు? |
11
|
నేను బాదం తోపుకి వెళ్లాను ఫలసాయమెలా ఉందో చూసేందుకు ద్రాక్షా తీగెలు పూశాయేమో చూసేందుకు దానిమ్మలు మొగ్గతొడిగాయేమో చూసేందుకు, |
12
|
నేనింకా గ్రహించక ముందే నా తనువు నన్ను రాజోద్యోగుల రథాల్లోకి చేర్చినది షూలమ్మీతీ తిరిగిరా, తిరిగిరా మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా, మహనయీము నాట్యమాడు షూలమ్మీతీ నేల తేరిపార చూస్తారు? |
13
|
[This verse may not be a part of this translation] |
Song-of-Solomon 6:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...