ఓ నా ప్రియసఖీ, నీవు తిర్సా [*తిర్సా ఇశ్రాయేలు ఉత్తర భాగంలోని రాజధానుల్లో ఒకటి.] నగరమంత సుందర మైనదానివి, యెరూషలేమంత ఆహ్లాదకరమైన దానివి, నగర దుర్గాలంతటి భయంకరురాలివి. [†నగర దుర్గాలంతటి భయంకరురాలివి ఇక్కడ వాడబడిన హీబ్రూ పదానికి అర్థం అంత స్పష్టంగా తెలియడం లేదు.]
నీవు నా వైపు చూడకు! నీ చూపులు నన్ను పురికొల్పి ఉన్మత్తున్ని చేస్తాయి గిలాదు పర్వత చరియల నుండి గెంతులేస్తూ దిగివచ్చే గొర్రెపిల్లల మాదిరిగా నీ సుదీర్ఘ శిరోజాలు జాలువారు తున్నాయి.
కాని, నా గువ్వ పిట్ట నిష్కళంకురాలు ఒక్కతే (నాకైన స్త్రీ) ఆమె తన తల్లికి ముద్దుబిడ్డ. తన తల్లికి గారాల కూచి! కన్యలే ఏమి, రాణులు, సేవకు రాండ్రు కూడా ఆమెను చూచినంతనే ప్రశంసిస్తారు.
నేనింకా గ్రహించక ముందే [*నేనింకా గ్రహించక ముందే హీబ్రూలో ఈ పదబంధం అస్పష్టంగా ఉంది.] నా తనువు నన్ను రాజోద్యోగుల [†రాజోద్యోగులు “అమ్మినదీ” లేక, నా రాజు పరివారం.] రథాల్లోకి చేర్చినది
షూలమ్మీతీ [‡షూలమ్మీతీ లేక షూలమిత్ ఈ మాట “సొలొమోను” కి స్త్రీలింగ రూపం కావచ్చు. ఆమె సొలొమోను భార్య, లేక సొలొమోను వధువు అవుతుంది అని దీని అర్థం కావచ్చు. ఈ పేరుకి అర్థం “శాంతమతి” లేక “షూనేమునుంచి వచ్చిన స్త్రీ” కావచ్చు.] తిరిగిరా, తిరిగిరా మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా, మహనయీము [§మహనయీము లేక “విజయోత్సవ నృత్యం,” లేక “రెండు శిబిరాల నాట్యం” కావచ్చు.] నాట్యమాడు షూలమ్మీతీ నేల తేరిపార చూస్తారు?