1
|
నా ప్రియులారా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఓహో, నువ్వు సుందరంగా ఉన్నావు! నీ మేలి ముసుగు కింద నీళ్ళు పావురాల్లా ఉన్నాయి. నీ శిరోజాలు పొడుగ్గా జారుతున్నాయి గిలాదు పర్వత సానువుల కింద నృత్యం చేసే మేకపిల్లల్లా. |
2
|
అప్పుడే స్నానం చేసి వస్తున్న ఆడ మేకల్లా నీ పళ్లు తెల్లగావున్నాయి. అవన్నీ కవలపిల్లల్ని కంటాయి, వాటిలో ఒక్కదానికి కూడా పిల్ల చావ లేదు. |
3
|
నీ పెదవులు ఎర్ర పట్టు దారంలా ఉన్నాయి. నీ నోరు అందంగా ఉంది నీ మేలి ముసుగు కింది నీ చెక్కిళ్లు రెండు దానిమ్మపండు చెక్కల్లా ఉన్నాయి. |
4
|
నీ మెడ పొడుగ్గా సన్నగా దావీదు గోపురంలా ఉంది శక్తిమంతులైన సైనికుల డాళ్లు వెయ్యిడాళ్ళు దాని గోడల మీద అలంకరించడం కోసం ఆ గోపురాన్ని కట్టారు. |
5
|
నీ స్తనాలు, తెల్ల కలువల్లో మేస్తున్న కవల జింక పిల్లల్లా ఉన్నాయి కవల దుప్పి పిల్లల్లా ఉన్నాయి. |
6
|
పగలు తన తుది శ్వాస విడిచేటప్పుడు నీడలు పారిపోయేటప్పుడు నేను ఆ గోపరస పర్వతానికి వెడతాను ఆ సాంబ్రాణి కొండకు వెతాను. |
7
|
నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది. నీకెక్కడా వికారమైన గుర్తుల్లేవు! |
8
|
నా పెళ్లికూతురా! లెబానోను నుండి నాతోరా లెబానోనునుండి నాతోరా. అమాన పర్వత శిఖరాన్నుండి శెనీరు హెర్మోనుల కొండకొనల నుండి సింహగుహల నుండి చిరుత పులుల పర్వతాలనుండి రా! |
9
|
నా ప్రేయసీ! నా ప్రియ వధూ నన్ను ఉద్రేక పరుస్తావు. ఒకే ఒక చూపుతో నీ హారంలోని ఒకే ఒక రత్నంతో నా హృదయాన్ని దోచుకున్నావు. |
10
|
నా ప్రేయసీ! నా ప్రియ వధూ! నీ ప్రేమ చాలా సుందరమైనది ద్రాక్షారసంకన్నా నీ ప్రేమ గొప్పది, నీ పరిమళ ద్రవ్యపు సువాసన ఏ రకమైన సుగంధ ద్రవ్యంకన్నా గొప్పది! |
11
|
నా ప్రియవధూ నీ పెదవులు తేనె లూరుతున్నాయి నీ నాలుక (కింద) నుంచి తేనే, పాలూ జాలువారు తున్నాయి నీ దుస్తులు మధుర పరిమళాన్ని గుబాళిస్తున్నాయి. |
12
|
నా ప్రియా, నా వధూ, నీవు పరిశుద్ధురాలివి మూయబడిన ఉద్యానవనం, మూయబడిన జలా శయం, బిగించబడిన జలధారల వంటి దానివి. |
13
|
నీ శరీరమొక తోటను పోలినది దానిమ్మ వృక్షాలతో తదితర మధుర ఫల వృక్షాలతో గోరింట, జటా మాంసి, |
14
|
కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి బోళం, అగరు యిత్యాది అతి శ్రేష్ట సుగంధ ద్రవ్యాలనిచ్చే తరులతాదులతో నిండిన నందనవనాన్ని పోలినది. |
15
|
నీవు ఉద్యాన జలాశయం వంటిదానివి మంచినీటి ఊటల బావిలాంటిదానివి, లెబానోను పర్వతం నుంచి జాలువారే సెలయేరు వంటిదానివి. |
16
|
ఉత్తర పవనమా లే! దక్షిణ పవనమా రా! నా ఉద్యానవనంపై వీచి, దాని మధుర సౌరభాన్ని వెద జల్లండి. నా ప్రియుడు తన ఉద్యానవనానికి రావాలి అందలి మధుర ఫలాలు ఆరగించాలి. |
Song-of-Solomon 4:8 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...