English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Song of Solomon Chapters

Song of Solomon 4 Verses

1 నా ప్రియులారా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఓహో, నువ్వు సుందరంగా ఉన్నావు! నీ మేలి ముసుగు కింద నీళ్ళు పావురాల్లా ఉన్నాయి. నీ శిరోజాలు పొడుగ్గా జారుతున్నాయి గిలాదు పర్వత సానువుల కింద నృత్యం చేసే మేకపిల్లల్లా.
2 అప్పుడే స్నానం చేసి వస్తున్న ఆడ మేకల్లా నీ పళ్లు తెల్లగావున్నాయి. అవన్నీ కవలపిల్లల్ని కంటాయి, వాటిలో ఒక్కదానికి కూడా పిల్ల చావ లేదు.
3 నీ పెదవులు ఎర్ర పట్టు దారంలా ఉన్నాయి. నీ నోరు అందంగా ఉంది నీ మేలి ముసుగు కింది నీ చెక్కిళ్లు రెండు దానిమ్మపండు చెక్కల్లా ఉన్నాయి.
4 నీ మెడ పొడుగ్గా సన్నగా దావీదు గోపురంలా ఉంది శక్తిమంతులైన సైనికుల డాళ్లు వెయ్యిడాళ్ళు దాని గోడల మీద అలంకరించడం కోసం ఆ గోపురాన్ని కట్టారు.
5 నీ స్తనాలు, తెల్ల కలువల్లో మేస్తున్న కవల జింక పిల్లల్లా ఉన్నాయి కవల దుప్పి పిల్లల్లా ఉన్నాయి.
6 పగలు తన తుది శ్వాస విడిచేటప్పుడు నీడలు పారిపోయేటప్పుడు నేను ఆ గోపరస పర్వతానికి వెడతాను ఆ సాంబ్రాణి కొండకు వెతాను.
7 నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది. నీకెక్కడా వికారమైన గుర్తుల్లేవు!
8 నా పెళ్లికూతురా! లెబానోను నుండి నాతోరా లెబానోనునుండి నాతోరా. అమాన పర్వత శిఖరాన్నుండి శెనీరు హెర్మోనుల కొండకొనల నుండి సింహగుహల నుండి చిరుత పులుల పర్వతాలనుండి రా!
9 నా ప్రేయసీ! [*ప్రేయసీ శబ్ధార్థ ప్రకారం “సోదరి.”] నా ప్రియ వధూ నన్ను ఉద్రేక పరుస్తావు. ఒకే ఒక చూపుతో నీ హారంలోని ఒకే ఒక రత్నంతో నా హృదయాన్ని దోచుకున్నావు.
10 నా ప్రేయసీ! నా ప్రియ వధూ! నీ ప్రేమ చాలా సుందరమైనది ద్రాక్షారసంకన్నా నీ ప్రేమ గొప్పది, నీ పరిమళ ద్రవ్యపు సువాసన ఏ రకమైన సుగంధ ద్రవ్యంకన్నా గొప్పది!
11 నా ప్రియవధూ నీ పెదవులు తేనె లూరుతున్నాయి నీ నాలుక (కింద) నుంచి తేనే, పాలూ జాలువారు తున్నాయి నీ దుస్తులు మధుర పరిమళాన్ని [†మధుర పరిమళాలు పరిమళ ద్రవ్యం లేక “లెబానోను.”] గుబాళిస్తున్నాయి.
12 నా ప్రియా, నా వధూ, నీవు పరిశుద్ధురాలివి మూయబడిన ఉద్యానవనం, మూయబడిన జలా శయం, బిగించబడిన జలధారల వంటి దానివి.
13 నీ శరీరమొక తోటను పోలినది దానిమ్మ వృక్షాలతో తదితర మధుర ఫల వృక్షాలతో గోరింట, జటా మాంసి,
14 కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి బోళం, అగరు యిత్యాది అతి శ్రేష్ట సుగంధ ద్రవ్యాలనిచ్చే తరులతాదులతో నిండిన నందనవనాన్ని పోలినది.
15 నీవు ఉద్యాన జలాశయం వంటిదానివి మంచినీటి ఊటల బావిలాంటిదానివి, లెబానోను పర్వతం నుంచి జాలువారే సెలయేరు వంటిదానివి.
16 ఉత్తర పవనమా లే! దక్షిణ పవనమా రా! నా ఉద్యానవనంపై వీచి, దాని మధుర సౌరభాన్ని వెద జల్లండి. నా ప్రియుడు తన ఉద్యానవనానికి రావాలి అందలి మధుర ఫలాలు ఆరగించాలి.
×

Alert

×