నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య నీవు అడవి చెట్ల మధ్య ఆపిలు చెట్టులా ఉన్నావు! ఆనంద భరితనై నేనతని నీడన కూర్చుంటాను! నా ప్రియుని నీడలో కూర్చుని నేను ఆనందిస్తాను, అతని పండు నాకెంతో తియ్యగా వుంది.
ఎండు ద్రాక్షాలతో [†ఎండు ద్రాక్షాలు లేదా “ఎండు ద్రాక్ష రొట్టెలు.”] నాకు బలాన్నివ్వండి, ఆపిలు పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను ప్రేమతో బలహీనమయ్యాను. [‡ప్రేమతో బలహీనమయ్యాను లేదా “నేను ప్రేమ రోగిని.”]
యెరూషలేము స్త్రీలారా, నాకు వాగ్దానం చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ్ల మీదా ఒట్టేసి, నేను సిద్ధపడేవరకూ. [§నేను సిద్ధపడేవరకూ శబ్దార్థ ప్రకారం “అది కోరేవరకు.”] ప్రేమను లేపవద్దు, ప్రేమను పురికొల్పవద్దు.
నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు లేదా లేడి పిల్లలా ఉన్నాడు. మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు, కిటికీలోనుంచి తేరి పార చూస్తూ, అల్లిక కిటికీలోనుంచి [*అల్లిక కిటికీలోనుంచి లేదా “కిటికీమీద ఉండే కొయ్యతెర.”] చూస్తూ
రోజు తన చివరి శ్వాసను విడిచినప్పుడు నీడలు పరుగెత్తినప్పుడు, నా ప్రియుడా, చీలిన పర్వతాల [‡చీలిన పర్వతాలు లేదా “బెథెర్ పర్వతాలు” లేదా “సుగంధ ద్రవ్యాల పర్వతాలు.”] మీద దుప్పిలా, లేడిపిల్లలా తిరుగు!