1
|
నేను మైదానంలో కుంకుమ పువ్వును లోయలలో కస్తూరి పుష్పాన్ని. |
2
|
నా ప్రియురాలా, ఇతర స్త్రీల మధ్య నీవు ముళ్ల మధ్య కస్తూరి పుష్పంలా ఉన్నావు! |
3
|
నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య నీవు అడవి చెట్ల మధ్య ఆపిలు చెట్టులా ఉన్నావు! ఆనంద భరితనై నేనతని నీడన కూర్చుంటాను! నా ప్రియుని నీడలో కూర్చుని నేను ఆనందిస్తాను, అతని పండు నాకెంతో తియ్యగా వుంది. |
4
|
నా ప్రియుడు నన్ను మద్యగృహానికి తీసుకుని వెళ్లాడు, నా మీద అతని ఉద్దేశం ప్రేమ. |
5
|
ఎండు ద్రాక్షాలతో నాకు బలాన్నివ్వండి, ఆపిలు పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను ప్రేమతో బలహీనమయ్యాను . |
6
|
నా ప్రియుని ఎడమ చేయి నా తల కింద ఉంది, అతని కుడి చేయి నన్ను పట్టుకొంది, |
7
|
యెరూషలేము స్త్రీలారా, నాకు వాగ్దానం చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ్ల మీదా ఒట్టేసి, నేను సిద్ధపడేవరకూ . ప్రేమను లేపవద్దు, ప్రేమను పురికొల్పవద్దు. |
8
|
నా ప్రియుని గొంతు వింటున్నాను. అదిగో అతడు వస్తున్నాడు. పర్వతాల మీది నుంచి దూకుతూ కొండల మీది నుంచి వస్తున్నాడు. |
9
|
నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు లేదా లేడి పిల్లలా ఉన్నాడు. మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు, కిటికీలోనుంచి తేరి పార చూస్తూ, అల్లిక కిటికీలోనుంచి చూస్తూ |
10
|
నా ప్రియుడు నాతో అంటున్నాడు, “లే, నా బంగారు కొండా, నా సుందరాంగీ, మనం పోదాంపద! |
11
|
చూడు, శీతాకాలం వెళ్లిపోయింది, వానలు వచ్చాయి వెళ్లాయి. |
12
|
పొలాల్లో పూలు వికసిస్తున్నాయి ఇది పాడే సమయం! కోలాహలపు పావురాలు తిరిగి వచ్చాయి. |
13
|
అరటి చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి. పూలు పూస్తున్న ద్రాక్షా తీగల వాసన చూడు. లే, నా బంగారు కొండా, నా సుందరాంగీ, మనం పోదాం పద!” |
14
|
ఇక్కడ ఈ పర్వతం మీద కనపడని ఎత్తైన శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా! నిన్ను చూడనిమ్ము, నీ గొంతు విననిమ్ము, నీ గొంతు ఎంతో మధురం, నువ్వెంతో సుందరం! |
15
|
మాకోసం గుంటనక్కల్ని పట్టుకో ద్రాక్షాతోటల్ని పాడుసే చిన్న గుంటనక్కల్ని! మా ద్రాక్షాతోట ఇప్పుడు పూతమీద ఉంది. |
16
|
నా ప్రియుడు నావాడు, నేను అతని దానను! అతడు పద్మాల నడుమ గొర్రెలను మేపుతున్నాడు! |
17
|
రోజు తన చివరి శ్వాసను విడిచినప్పుడు నీడలు పరుగెత్తినప్పుడు, నా ప్రియుడా, చీలిన పర్వతాల మీద దుప్పిలా, లేడిపిల్లలా తిరుగు! |
Song-of-Solomon 2:5 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...