1
|
జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి! మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది. |
2
|
మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి. |
3
|
పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి. తెరువబడిన ద్వారాల్లోనుంచి అవి పిలుస్తున్నాయి. |
4
|
జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా. |
5
|
మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి. అవివేకులారా, తెలివిగలిగి ఉండటం నేర్చుకోండి. |
6
|
వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి. సరైన విషయాలు నేను మీకు చెబుతాను. |
7
|
నా మాటలు సత్యం. చెడు అబద్ధాలు నాకు అసహ్యం. |
8
|
నేను చెప్పే విషయాలు సరైనవి. నా మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని ఏమీలేదు. |
9
|
తెలివిగల వాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి. తెలివిగల మనిషి ఈ సంగతులు గ్రహిస్తాడు. |
10
|
నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది. ఆ తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది. |
11
|
జ్ఞానము ముత్యాలకంటె విలువగలది. ఒకడు కోరుకోదగిన దేని కంటే కూడ జ్ఞానము ఎక్కువ విలువగలది.” |
12
|
“నేను జ్ఞానాన్ని, నేను మంచి తీర్పుతో జీవిస్తాను. తెలివితో, మంచి పథకాలతో నేను ఉండటం మీరు చూడగలరు. |
13
|
ఒక మనిషి యెహోవాను గౌరవిసే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు. నేను (జ్ఞానము) గర్విష్ఠులను, ఇతరులకంటె మేమే గొప్ప అనుకొనేవాళ్లను అసహ్యించుకొంటాను. చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం. |
14
|
కానీ మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను. తెలివీ శక్తిని నేను వారికి ఇస్తాను! |
15
|
రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు. న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు. |
16
|
భూమిమీద ప్రతీ మంచి పాలకుడూ తన కింద ఉన్న ప్రజలను పాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తాడు. |
17
|
నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను. నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు. |
18
|
నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి. నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను. |
19
|
నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి. నా కానుకలు స్వచ్ఛమైన వెండికంటే మంచివి. |
20
|
నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను. సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను. |
21
|
నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను. అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను. |
22
|
ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట యెహోవాచేత చేయబడింది నేనే |
23
|
నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను. ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను. |
24
|
నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను. నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను. |
25
|
నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను. |
26
|
యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను. ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను. |
27
|
యెహోవా ఆకాశాలను చేసినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు, మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. |
28
|
ఆకాశంలో యెహోవా మేఘాలను ఉంచకముందే నేను పుట్టాను. మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు నేను అక్కడ ఉన్నాను. |
29
|
సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు నేను అక్కడ ఉన్నాను. యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు, భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను. |
30
|
నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు. ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను. |
31
|
యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు. అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు. |
32
|
“పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి. మీరు నా మార్గాలు వెంబడిస్తే మీరు కూడా సంతోషంగా ఉండగలరు” |
33
|
నా ఉపదేశాలు విని బుద్ధిమంతులుకండి. వినుటకు తిరస్కరించకుడి. |
34
|
ఏ వ్యక్తి అయితే వింటాడో అతడు సంతోషంగా ఉంటాడు. అతను అనుదినం నా ద్వారాల దగ్గర వేచి యుంటాడు. |
35
|
నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును యెహోవా వద్దనుండి అతడు మంచివాటిని పొందును. |
36
|
అయితే నాకు విరోధముగా పాపముచేయు వ్యక్తి తనకు తానే హాని చేసుకొనును. నన్ను అసహ్యించు కొనువారు మరణమును ప్రేమించెదరు.” |
Proverbs 8:20 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...