Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Proverbs Chapters

Proverbs 8 Verses

Bible Versions

Books

Proverbs Chapters

Proverbs 8 Verses

1 జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి! మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది.
2 మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి.
3 పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి. తెరువబడిన ద్వారాల్లోనుంచి అవి పిలుస్తున్నాయి.
4 జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా.
5 మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి. అవివేకులారా, తెలివిగలిగి ఉండటం నేర్చుకోండి.
6 వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి. సరైన విషయాలు నేను మీకు చెబుతాను.
7 నా మాటలు సత్యం. చెడు అబద్ధాలు నాకు అసహ్యం.
8 నేను చెప్పే విషయాలు సరైనవి. నా మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని ఏమీలేదు.
9 తెలివిగల వాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి. తెలివిగల మనిషి ఈ సంగతులు గ్రహిస్తాడు.
10 నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది. ఆ తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది.
11 జ్ఞానము ముత్యాలకంటె విలువగలది. ఒకడు కోరుకోదగిన దేని కంటే కూడ జ్ఞానము ఎక్కువ విలువగలది.”
12 “నేను జ్ఞానాన్ని, నేను మంచి తీర్పుతో జీవిస్తాను. తెలివితో, మంచి పథకాలతో నేను ఉండటం మీరు చూడగలరు.
13 ఒక మనిషి యెహోవాను గౌరవిసే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు. నేను (జ్ఞానము) గర్విష్ఠులను, ఇతరులకంటె మేమే గొప్ప అనుకొనేవాళ్లను అసహ్యించుకొంటాను. చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం.
14 కానీ మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను. తెలివీ శక్తిని నేను వారికి ఇస్తాను!
15 రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు. న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు.
16 భూమిమీద ప్రతీ మంచి పాలకుడూ తన కింద ఉన్న ప్రజలను పాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తాడు.
17 నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను. నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు.
18 నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి. నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను.
19 నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి. నా కానుకలు స్వచ్ఛమైన వెండికంటే మంచివి.
20 నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను. సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను.
21 నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను. అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను.
22 ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట యెహోవాచేత చేయబడింది నేనే
23 నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను. ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను.
24 నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను. నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను.
25 నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను.
26 యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను. ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను.
27 యెహోవా ఆకాశాలను చేసినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు, మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
28 ఆకాశంలో యెహోవా మేఘాలను ఉంచకముందే నేను పుట్టాను. మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు నేను అక్కడ ఉన్నాను.
29 సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు నేను అక్కడ ఉన్నాను. యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు, భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను.
30 నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు. ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను.
31 యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు. అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు.
32 “పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి. మీరు నా మార్గాలు వెంబడిస్తే మీరు కూడా సంతోషంగా ఉండగలరు”
33 నా ఉపదేశాలు విని బుద్ధిమంతులుకండి. వినుటకు తిరస్కరించకుడి.
34 ఏ వ్యక్తి అయితే వింటాడో అతడు సంతోషంగా ఉంటాడు. అతను అనుదినం నా ద్వారాల దగ్గర వేచి యుంటాడు.
35 నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును యెహోవా వద్దనుండి అతడు మంచివాటిని పొందును.
36 అయితే నాకు విరోధముగా పాపముచేయు వ్యక్తి తనకు తానే హాని చేసుకొనును. నన్ను అసహ్యించు కొనువారు మరణమును ప్రేమించెదరు.”

Proverbs 8:18 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×