1
|
ఆ మహా రోగం తర్వాత మోషేతో, అహరోను కుమారుడు యాజకుడైన ఎలీయాజరుతో యెహోవా మాట్లాడాడు: |
2
|
“ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కించండి. ప్రతి కుటుంబాన్నీ చూచి, 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న పురుషులందరిని లెక్కించండి. వీరు ఇశ్రాయేలు సైన్యంలో పని చేయటానికి సమర్థులు” అని ఆయన చెప్పాడు. |
3
|
ఇప్పటికి మోయాబు మైదానంలోనే ప్రజలు నివాసం చేస్తున్నారు. ఇది యెరికోకు ఎదురుగా యోర్దాను నది దగ్గర ఉంది. కనుక మోషే, యాజకుడైన ఎలీయాజరు ప్రజలతో మాట్లాడారు. వారు |
4
|
“20 గాని, అంతకంటె ఎక్కువ వయసు గాని ఉన్న మగవాళ్ల సంఖ్య లెక్కించాలి. ఇది మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ అన్నారు.” ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల జాబితా ఇది: |
5
|
రూబేను సంతతి వాళ్లు వీరే. (యాకోబుకు) ఇశ్రాయేలు పెద్ద కుమారుడు రూబేను. వంశాలు: హనోకు - హనోకీల వంశం పల్లు పల్లువారి వంశం |
6
|
హెస్రోను హెస్రోనీల వంశం కర్మి కర్మీల వంశం |
7
|
రూబేను సంతతిలోని వంశాలు అవి. మొత్తం 43, 730 మంది పురుషులు. |
8
|
పల్లు కుమారుడు ఏలీయాబు. |
9
|
నెమూయేలు, దాతాను, అబీరాము ముగ్గురూ ఏలీయాబు కుమారులు. మోషే, అహరోనులకు ఎదురు తిరిగిన నాయకులు దాతాను, అబీరాము అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవాకు కోరహు ఎదురు తిరిగినప్పుడు వారు కోరహును వెంబడించారు. |
10
|
అప్పుడే భూమి తెరచుకొని, కోరహును, అతని అనుచరులు అందరినీ మింగివేసింది. చనిపోయిన వారి సంఖ్య మొత్తం 250 మంది పురుషులు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇది ఒక హెచ్చరిక, గుర్తు. |
11
|
అయితే కోరహు కుటుంబంలోని ఇతరులు మరణించలేదు. |
12
|
షిమ్యోను సంతతిలోని వంశాలు ఇవి: నెమూయేలు - నెమూయేలీ వంశం యామీను - యామీనీల వంశం యాకీను - యాకీనీల వంశం |
13
|
జెరహు - జెరహీల వంశం షావూలు - వూలీ వంశం |
14
|
షిమ్యోను సంతతిలోని వంశాలు అవి. వారు మొత్తం 22,200 మంది. |
15
|
గాదు సంతతిలోని వంశాలు ఇవి: సెపోను - సెపోనీల వంశం హగ్గి - హగ్గీల వంశం షూనీ - షూనీల వంశం |
16
|
ఓజని - ఓజనీల వంశం ఏరీ - ఏరీల వంశం |
17
|
అరోది - అరోదీల వంశం అరేలి - అరేలీల వంశం |
18
|
అవి గాదు సంతతిలోని వంశాలు. వారు మొత్తం 40,500 మంది పురుషులు. |
19
|
[This verse may not be a part of this translation] |
20
|
[This verse may not be a part of this translation] |
21
|
పెరెసు వంశాలు ఇవి: హెస్రోను - హెస్రోనీల వంశం హములు - హములీల వంశం |
22
|
యూదా సంతతిలోని వంశాలు ఇవి. పురుషుల సంఖ్య మొత్తం 76,500. |
23
|
ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు ఇవి: తోల - తోలాలీ వారి వంశం పువ్వా - పువ్వీల వంశం |
24
|
యాషుబు - యాషుబీల వంశం షిమ్రోను - షిమ్రోనీల వంశం |
25
|
ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 64,300. |
26
|
జెబూలూను సంతతిలోని వంశాలు: సెరెదు - సెరెదీల వంశం ఏలోను - ఏలోనీల వంశం యహలేలు - యహలేల వంశం |
27
|
జెబూలూను సంతతిలోని వంశాలు అవి. పురుషులు సంఖ్య మొత్తం 60,500. |
28
|
యోసేపు ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. ఒక్కో కుమారుడు కొన్ని స్వంత వంశాలతో కూడిన ఒక్కో సంతతి అయ్యారు. |
29
|
మనష్షే సంతతి ఏవనగా: మాకీరు - మాకీరువారి వంశం (మాకీరు గిలాదుకు తండ్రి,) గిలాదు - గిలాదీల వంశం |
30
|
గిలాదు వంశాలు: ఈజురు - ఈజరీల వంశం హెలెకు - హెలెకీవారి వంశం |
31
|
అశ్రీయేలు - అశ్రీయేలీల వంశం షెకెము - షెకెమీల వంశం |
32
|
షెమిద - షెమిదీల వంశం హెపెరు - హెపెరీల వంశం |
33
|
హెపెరు కుమారుడు సెలోపెహదు. కానీ అతనికి కుమార్తెలు తప్ప కుమారులు లేరు. అతని కుమార్తెల పేర్లు మహల, నోయా, హోగ్ల, మిల్కా తిర్సా. |
34
|
అవన్నీ మనష్షే సంతతిలోని వంశాలు. పురుషుల సంఖ్య మొత్తం 52,700 |
35
|
ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు ఏవనగా: షుతల - షుతలీల వంశం బేకరు - బేకరీల వంశం తహను - తహనీల వంశం |
36
|
షుతలహు వంశం వాడు ఏరాను. అతని వంశ ఏరానీల వంశం |
37
|
ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 32,500 యోసేపు సంతతికి చెందిన మొత్తం మనుష్యులు వారే. |
38
|
బెన్యామీను సంతతిలోని వంశాలు: బెలా - బెలాలీ వంశం అష్బెలు - అష్బెలీ వంశం అహీరం - అహీరమీయీల వంశం |
39
|
షుపం - షుపామీల వంశం హుపం - హుపామీల వంశం |
40
|
బెలా వంశాలు ఏవనగా: ఆర్దు - ఆర్దీల వంశం నయమాను - నయమానీల వంశం |
41
|
బెన్యామీను సంతతిలోని వంశాలన్నీ అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,600 |
42
|
దాను సంతతిలోని వంశాలు: షూషాము- షూషామల వంశం. అది దాను సంతతిలోని కుటుంబం. |
43
|
షూషామీల వంశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పురుషుల సంఖ్య మొత్తం 64,400 |
44
|
ఆషేరు సంతతిలోని వంశాలు: ఇమ్నా - ఇమ్నా వారి వంశం ఇష్వి - ఇష్వీల వంశం బెరీయ - బెరీయాల వంశం |
45
|
బెరీయా వంశాలు: హెబెరు - హెబెరీల వంశం మల్కీయేలు - మల్కీయేలీల వంశం. |
46
|
(ఆషేరుకు శెరహు అనే కూతురు కూడ ఉంది.) |
47
|
ఆషేరు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 53,400 |
48
|
నఫ్తాలీ సంతతిలోని వంశాలు: యహసియేలు - యహసియేలీల వంశం గూని - గూనీల వంశం |
49
|
యెసెరు - యెసెరీల వంశం షిల్లేము - షిల్లేమీల వంశం |
50
|
నఫ్తాలీ సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,400 |
51
|
కనుక ఇశ్రాయేలు పురుషుల సంఖ్య మొత్తం 6,01,730 |
52
|
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: |
53
|
“ప్రతి వంశానికి దేశం లభిస్తుంది. ఇది నేను వారికి వాగ్దానం చేసిన దేశం. లెక్కించబడిన ప్రజలందరికీ సరిపడినంత భూమి ప్రతి వంశానికి లభిస్తుంది. |
54
|
పెద్ద వంశానికి ఎక్కువ భూమి లభిస్తుంది. చిన్న వంశానికి తక్కువ భూమి లభిస్తుంది. అయితే నేను వాగ్దానం చేసిన దేశం ప్రతి వంశానికీ లభిస్తుంది. మరియు వారికి లభించే భూమి, లెక్కించబడిన వారందరికీ సరిపోయేటంత ఉంటుంది. |
55
|
ప్రతి వంశానికీ ఆ భూమి ఇవ్వబడుతుంది. ఏ వంశం వారి భూమికి ఆ పేరే పెట్టబడుతుంది. |
56
|
ప్రజలకు ఇస్తానని నేనే వాగ్దానం చేసినంతగా ఉంటుంది ఆ భూమి. పెద్ద వంశాలకీ, చిన్నవాటికీ అందివ్వబడుతుంది.” |
57
|
లేవీ సంతతి కూడ లెక్కించబడింది. లేవీ సంతతిలోని వంశాలు ఇవి: గెర్షోను - గెర్షోనీల వంశం కహాతు - కహాతీల వంశం మెరారి - మెరారిల వంశం |
58
|
ఇవి కూడ లేవీ సంతతిలోని వంశాలే: లిబ్నీల వంశం హెబ్రోనీల వంశం మహ్లీవంశం మూషీల వంశం కోరహీల వంశం అమ్రాము కహాతు వంశం వాడు. |
59
|
అమ్రాము భార్య పేరు యొకెబెదు. ఆమె కూడ లేవీ సంతతిలోనిదే. ఆమె ఈజిప్టులో పుట్టింది. అమ్రాము, యొకెబెదులకు అహరోను, మోషే ఇద్దరు కుమారులు. వారికి మిర్యాము అని ఒక కుమార్తె కూడ ఉంది. |
60
|
నాదాబు, అబీహు, ఎలీయాజరు, ఈతామారులకు తండ్రి అహరోను. |
61
|
కానీ నాదాబు, అబీహు చనిపోయారు. అంగీకారం కాని అగ్నితో దేవునికి అర్పణచేసినందువల్ల వారు చనిపోయారు. |
62
|
లేవీ సంతతిలో పురుషుల సంఖ్య మొత్తం 23,000, అయితే ఇతర ఇశ్రాయేలు మనుష్యులతో వీరు లెక్కించబడలేదు. మిగిలినవారికి యెహూవా వాగ్దానం చేసిన భూమి మాత్రం లేదు. |
63
|
మోషే, యాజకుడైన ఎలీయాజరు ఈ ప్రజలందరినీ లెక్క చేసారు. మోయాబు మైదానాల్లో వారు ఇశ్రాయేలు ప్రజలను లెక్క తీసారు. ఇది యెరికో ఎదుట యోర్దాను నది అవతల జరిగింది. |
64
|
చాలకాలం కిందట సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే, యాజకుడైన అహరోనూ లెక్కపెట్టారు. అయితే వాళ్లంతా చనిపోయారు. మోషే మోయాబు మైదానాల్లో లెక్కపెట్టిన వారు వేరు, అంతకుముందు లెక్కపెట్టిన వారు వేరు. |
65
|
వారు అందరూ ఎడారిలోనే చస్తారు అని ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా చెప్పినందువల్ల ఇలా జరిగింది. సజీవంగా ఉన్నవాళ్లు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే. |
Numbers 26:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...