1
|
“ఒక వేళ ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ సమాధాన బలి అయితే, మగ లేక ఆడ జంతువును తన పశువుల మందలోనుండి అతడు యెహోవాకు ఇస్తే ఆ పశువులో ఎలాంటి దోషం ఉండకూడదు. |
2
|
ఆ వ్యక్తి ఆ పశువు తలమీద తన చేతులు ఉంచాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ పశువును అతడు వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. |
3
|
ఈ వ్యక్తి సమాధాన బలిలోనుంచి యెహోవాకు హోమం చేయాలి. అంత్రములకు, లోపలి అవయవాలకు ఉండే కొవ్వు అంతటినీ అతడు అర్పించాలి. |
4
|
మూత్రపిండాలను ఆ రెండింటి మీద కొవ్వును, నడుం దగ్గర కొవ్వును అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జమును కప్పి ఉండే కొవ్వును అతడు తీయాలి. |
5
|
అప్పుడు ఆ కొవ్వును అహరోను కుమారులు బలిపీఠం మీద దహించాలి. దీనిని వారు అగ్నిలో కట్టెలమీద ఉన్న దహనబలి వేస్తారు. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనను యిచ్చే హోమం. |
6
|
“ఒకవేళ ఆ వ్యక్తి, యెహోవాకు సమాధాన అర్పణగా ఒక జంతువును మందలోనుండి తెస్తే, అది ఆడదిగాని, మగదిగాని దోషం లేనిదిగా ఉండాలి. |
7
|
అతడు ఒక గొర్రెపిల్లను తన అర్పణగా తెస్తే, అతడు దానిని యెహోవా ఎదుటికి తేవాలి. |
8
|
సన్నిధి గుడారం ఎదుట అతడు దాని తలమీద చేయి పెట్టి, దానిని వధించాలి. దాని రక్తాన్ని అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ చిలకరిస్తారు. |
9
|
అప్పుడు అతడు సమాధాన బలిలో నుంచి కొంత యెహోవాకు హోమం చేయాలి. కొవ్వు, కొవ్విన తోకమొత్తం, దాని లోపలి అవయవాల మీద చుట్టూ ఉండే కొవ్వు అతడు తీసుకొని రావాలి (వెన్నుపూస నుండి ఉండే తోకను అతడు కోసి వేయాలి). |
10
|
రెండు మూత్రపిండాలను, వాటిని కప్పి ఉండే కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును అతడు అర్పించాలి. కార్జానికి ఉండే కొవ్వుకూడా అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి. |
11
|
అప్పుడు యాజకుడు ఆ జంతువును బలిపీఠం మీద దహిస్తాడు. అది యెహోవాకు ప్రజలు అగ్నితో అర్పించిన ఆహారం అవుతుంది. |
12
|
“ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ మేక అయితే, అతడు దానిని యెహోవా ఎదుట అర్పించాలి. |
13
|
సన్నిధి గుడార ద్వారం దగ్గర అతడు దాని తల మీద చేయి పెట్టి దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు ఆ మేక రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. |
14
|
తర్వాత ఆ మేకలోని కొంతభాగాన్ని అతడు యెహోవాకు హోమం చేయాలి. లోపలి భాగాల్లోను, వాటి మీదను ఉండే కొవ్వును అతడు అర్పించాలి. |
15
|
రెండు మూతగ్రంథుల్ని, వాటి మీద ఉండే కొవ్వును, ఆ మేక నడుం దగ్గరి కొవ్వును అతడు అర్పణ చేయాలి. కార్జాన్ని కప్పి ఉండే కొవ్వును అతడు అర్పణ చేయాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి. |
16
|
మేక అవయవాలను యాజకుడు దహనం చేయాలి. అది అగ్నితో అర్పించబడ్డ ఆహారం అవుతుంది. అది ఇష్టమైన సువాసనగా ఉంటుంది. కొవ్వు మొత్తం యెహోవాకు చెందుతుంది. |
17
|
మీ తరాలన్నింటికీ శాశ్వతంగా ఈ నియమం కొనసాగుతుంది. మీరు ఎక్కడ నివసించినా కొవ్వునుగాని రక్తాన్నిగాని మీరు తినకూడదు.” |
Leviticus 3:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...