అలా చేసే వ్యక్తి పాపం చేసిన అపరాధి అవుతాడు. ఎందు చేతనంటే యెహోవాకు చెందిన పవిత్ర విషయాలను అతడు గౌరవించలేదు కనుక ఆ వ్యక్తి తన ప్రజల్లోనుంచి వేరు చేయబడాలి.
మీ ద్రాక్షా తోటల్లో ద్రాక్షాపండ్లన్నీ ఏరుకోవద్దు. నేలమీద పడిన ద్రాక్షపండ్లను ఏరుకోవద్దు. ఎందుచేతనంటే, పేదవాళ్ళ కోసం, మీ దేశంగుండా ప్రయాణం చేసే వాళ్ళకోసమూ మీరు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
“తీర్పు విషయంలో మీరు న్యాయంగా ఉండాలి. పేదవాళ్ళని చెప్పి ప్రత్యేకంగా పక్షపాతం చూపెట్టకూడదు. ప్రముఖులనీ పక్షపాతం చూపెట్ట కూడదు. మీ పొరుగు వారికి తీర్పు చెప్పేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి.
“నా ఆజ్ఞలకు నీవు విధేయత చూపాలి. రెండురకాల పశువులను కలిసి సంతానోత్సత్తి చేయకూడదు. రెండు రకాల విత్తనాలు నీ పొలంలో నీవు చల్లకూడదు. రెండు రకాల మిశ్రమ దారాలతో నేయబడిన బట్టలు నీవు తొడగకూడదు.
“మరొకని బానిస స్త్రీతో ఒకడు లైంగిక సంబంధాలు పెట్టుకోవటం సంభవించవచ్చు. అయితే ఈ బానిస స్త్రీ డబ్బుతో ఖరీదు చేయబడలేదు, లేక స్వతంత్రమూ పొందలేదు. ఇలా గనుక జరిగితే వారికి శిక్ష విధించాలి. కానీ వారికి మరణ శిక్ష లేదు. ఎందుచేతనంటే ఆ స్త్రీ స్వతంత్రురాలు కాదు.
అతణ్ణి పవిత్రం చేసే కార్యాన్ని యాజకుడు జరిగిస్తాడు. ఆ పొట్టేలును అతడు చేసిన పాపం కోసం అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా ఎదుట యాజకుడు అర్పించాలి. అప్పుడు అతడు చేసిన పాపం విషయంలో అతడు క్షమాపణ పొందుతాడు.
“ముందుకు మీరు మీ దేశంలో ప్రవేశిస్తారు. ఆ సమయంలో ఆహారంకోసం మీరు ఎన్నో రకాల చెట్లు నాటుతారు. ఒక చెట్టును నాటిన తర్వాత మూడు సంవత్సరాలవరకు ఆ చెట్టు ఫలం ఏదీ మీరు తినకూడదు. ఆ ఫలాన్ని మీరు ఉపయోగించకూడదు.
“మీ కుమార్తెను వేశ్యగా మార్చవద్దు. అలా చేయటం ఆమెపై మీకు గౌరవం లేదని వ్యక్తం చేస్తుంది. మీ దేశంలో ప్రజల్ని వేశ్యలు కానీయవద్దు. అలాంటి పాపంతో మీ దేశాన్ని నిండనీయవద్దు.
మీ స్వంత పౌరులను గౌరవించినట్టే, విదేశీయుల్ని కూడా మీరు గౌరవించాలి. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకొంటారో విదేశీయుల్ని కూడా అలా ప్రేమించాలి. ఎందుచేతనంటే ఒకప్పుడు మీరూ ఈజిప్టులో విదేశీయులే. నేను మీ దేవుడైన యెహోవాను.
మీ తక్కెడలు సమానంగా ఉండాలి. మీ మొగ్గులు ద్రావకాలను సరిగ్గా నింపేవిగా ఉండాలి. మీ త్రాసులు, తూనికరాళ్లు వస్తువుల్ని సరిగ్గా తూచేవిగా ఉండాలి. నేను మీ దేవుడైన యెహోవాను. నేనే మిమ్మన్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొనివచ్చాను!