1
|
మోషే, అహరోనులతో యెహోవా యింకా యిలా చెప్పాడు: |
2
|
“ఇశ్రాయేలు ప్రజలకు మీరిలా చెప్పండి: ఎవని దేహంలోనైనా స్రావం ఉంటేవాడు అపవిత్రుడు. |
3
|
వాని శరీరంలోనుండి స్రావం కారుతున్నా లేక నిలిచిపోయినా సరే ఫర్వాలేదు. |
4
|
“స్రావం ఉన్న వ్యక్తి పరుపుమీద పండుకొంటే, ఆ పరుపు అపవిత్రం. ఆ వ్యక్తి కూర్చొనేవన్నీ అపవిత్రం అవుతాయి. |
5
|
ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఈ వ్యక్తి పరుపును తాకితే అతడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానంచేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. |
6
|
ఇంకా స్రావంగల వాడు కూర్చున్న దేనిమీ దనైనా సరే కూర్చున్న ఏ వ్యక్తిగాని తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. |
7
|
అలానే స్రావంఉన్న వ్యక్తిని తాకిన ఏ వ్యక్తిగాని తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం వరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.” |
8
|
“స్రావంగల వాడు ఒక పవిత్రునిమీద ఉమ్మివేస్తే, ఈ పవిత్రుడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. ఈ వ్యక్తి సాయంత్రంవరకు అపవిత్రుడుగా ఉంటాడు. |
9
|
స్రావంగల వ్యక్తి కూర్చొని స్వారీ చేసిన ప్రతి ఆసనం అపవిత్రం అవుతుంది. |
10
|
కనుక స్రావంగలవాని కింద ఉన్న దేనినైనా తాకిన ప్రతి ఒక్కరూ సాయంత్రంవరకు అపవిత్రంగా వుంటారు. స్రావంగల వాని కింద ఉండే వస్తువులను మోసిన వ్యక్తి తన బట్టలు ఉదుకుకొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.” |
11
|
“ఒకవేళ స్రావంగల వ్యక్తి నీళ్లతో తన చేతులు కడుగుకోకుండా మరొక వ్యక్తిని తాకవచ్చును. అప్పుడు అవతల వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.” |
12
|
“అయితే స్రావంగల వ్యక్తి ఒక మట్టి పాత్రను తాకితే ఆ పాత్రను పగులగొట్టివేయాలి. స్రావంగల ఈ వ్యక్తి గనుక ఒక చెక్క పాత్రను తాకితే, ఆ పాత్రను నీళ్లతో కడగాలి.” |
13
|
“స్రావంగల వాడు తన స్రావం నుండి పవిత్రునిగా చేయబడితే అతడు తన శుద్ధికోసం తానే ఏడు రోజులు లెక్కబెట్టుకోవాలి. అప్పుడు అతడు పారుతున్న నీటిలో తన బట్టలు ఉతుక్కొని, స్నానం చేయాలి. అతడు పవిత్రుడు అవుతాడు. |
14
|
ఎనిమిదో రోజున రెండు గువ్వలను గాని రెండు పావురపు పిల్లలనుగాని ఆ వ్యక్తి తనకోసం తీసుకొని వెళ్లాలి. సన్నిధి గుడారద్వారం దగ్గర యెహోవా ఎదుటికి అతడు రావాలి. ఆ వ్యక్తి రెండు పక్షులను యాజకునికి యివ్వాలి. |
15
|
ఒక పక్షిని పాప పరిహారార్థ బలిగాను, మరో పక్షిని దహనబలిగాను యాజకుడు అర్పించాలి. కనుక యాజకుడు ఆ వ్యక్తిని యెహోవాకు పవిత్రునిగా చేస్తాడు. |
16
|
“ఒకనికి వీర్యస్ఖలనం అవుతోంటే అతడు నీళ్లలో పూర్తిగా స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. |
17
|
ఒకవేళ ఏ బట్టమీద గాని తోలుమీదగాని వీర్యం పడితే, ఆ బట్టను లేక తోలును నీళ్లలో కడగాలి. సాయంత్రంవరకు అది అపవిత్రంగా ఉంటుంది. |
18
|
ఒకవేళ ఒక పురుషుడు ఒక స్త్రీతో శయనించగా వీర్యస్ఖలనమైనప్పుడు ఆ స్త్రీ పురుషులు ఇద్దరూ నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.” |
19
|
“ఒక స్త్రీకి తన నెలసరి రక్తస్రావంనుండి స్రావంతో ఉంటే, ఆమె ఏడు రోజులు అపవిత్రంగా ఉంటుంది. ఎవరైనా ఆమెను తాకితే వారు ఆ రోజు సాయంత్రంవరకు అపవిత్రంగా ఉంటారు. |
20
|
మరియు ఆ స్త్రీ తన నెలసరి రక్తస్రావ సమయంలో పండు కొనేవన్నీ అపవిత్రం అవుతాయి. ఆ సమయంలో ఆమె కూర్చొనేవన్నీ అపవిత్రం అవుతాయి. |
21
|
ఎవరైనా ఆ స్త్రీ పడకను తాకినట్టుయితే ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. సాయంత్రం వరకు ఆ వ్యక్తి అపవిత్రుడు. |
22
|
ఒకవేళ ఎవరైనా ఆమె కూర్చున్న దేనినైనా తాకితే. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. సాయంత్రం వరకు ఆ వ్యక్తి అపవిత్రం. |
23
|
ఒకవ్యక్తి ఆమె పడకను తాకినా, లేక ఆమె కూర్చున్న దేనినైనా తాకినా, ఆ వ్యక్తి ఆ సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు. |
24
|
“మరియు ఒక స్త్రీ నెలసరి రక్తస్రావ సమయంలో ఒక పురుషుడు ఆమెతో లైంగిక పొందు అనుభవిస్తే, ఆ పురుషుడు ఏడురోజులపాటు అపవిత్రంగా ఉంటాడు. ఆ పురుషుడు పండుకొనే ప్రతి పడకా అపవిత్రం అవుతుంది.” |
25
|
“ఒక స్త్రీకి నెలసరి రక్తస్రావ సమయంలో గాక, ఆ తర్వాత ఆమెకు రక్తం చాల రోజుల వరకు స్రవిస్తే, అలా రక్తం స్రవించినన్నాళ్లూ, నెలసరి రక్తస్రావంలో వలెనే ఆమె అపవిత్రంగా ఉంటుంది. |
26
|
రక్త స్రావ సమయమంతటిలో ఆ స్త్రీ ఏ పడకమీద పరుండినా సరే, ఆమె నెలసరి రక్తస్రావ సమయంలో వలెనే ఉంటుంది ఆ పడక. ఆమె కూర్చొనేది ఏదైనా సరే, ఆమె నెలసరి రక్తస్రావ సమయంలో అపవిత్రమైనట్టే అపవిత్రం అవుతుంది. |
27
|
ఆ వస్తువులను ఏ వ్యక్తి తాకితే ఆ వ్యక్తి అపవిత్రం అవుతాడు. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రుడవుతాడు. |
28
|
ఆ తర్వాత ఆ స్త్రీ తన స్రావంనుండి పవిత్రం అయిన తర్వాత, ఆమె ఏడు రోజులు లెక్క పెట్టాలి. ఆ తర్వాత ఆమె పవిత్రం అవుతుంది. |
29
|
అప్పుడు ఎనిమిదో రోజున ఆమె రెండు గువ్వలను లేదా రెండు పావురపు పిల్లలను తీసుకొని రావాలి. సన్నిధి గుడార ద్వారం వద్ద యాజకుని దగ్గరకు ఆమె వాటిని తీసుకొని రావాలి. |
30
|
అప్పుడు ఒక పక్షిని పాపపరిహారార్థబలిగాను మరో పక్షిని దహనబలిగాను యాజకుడు అర్పించాలి. అలా యాజకుడు యెహోవా ఎదుట ఆమెను పవిత్రం చేయాలి. |
31
|
“అందుచేత ఇశ్రాయేలు ప్రజలు తమ అపవిత్రత విషయంలో వారి అపవిత్రతనుండి ప్రత్యేకించుకోవాల్సిందిగా మీరు హెచ్చరించాలి. మీరు ప్రజలను హెచ్చరించకపోతే, అప్పుడు వారు నా పవిత్ర గుడారాన్ని అపవిత్రం చేస్తారు. అప్పుడు వాళ్లు చావాల్సిఉంటుంది!” |
32
|
స్రావంగల వారి విషయంలో అవి నియమాలు. వీర్యస్ఖలనం వలన అపవిత్రులైన పురుషులను గూర్చిన నియమాలు అవి. |
33
|
మరియు నెలసరి రక్తస్రావం మూలంగా అపవిత్రమైన స్త్రీలకు అవి నియమాలు. అపవిత్రమైన స్త్రీతో శయనించి అపవిత్రమైన ఏ వ్యక్తికైనా అవి నియమాలు. |
Leviticus 15:5 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...