1
|
దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు, ఎన్నోవిధాలుగా మన పూర్వీకులతో మాట్లాడాడు. |
2
|
అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు. |
3
|
కుమారుడు దేవుని మహిమ యోక్క ప్రకాశం. తండ్రి యొక్క ఉనికిలో పరిపూర్ణ ఉనికిగలవాడు. కుమారుడు శక్తివంతమైన తన మాటతో అన్నిటినీ పోషించి సంరక్షిస్తున్నాడు. పాపపరిహారం చేసాక ఈయన పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ, మహా తేజ స్వియైన దేవుని కుడివైపు కూర్చున్నాడు. |
4
|
ఆయన దేవదూతలకన్నా గొప్పవాడు. దానికి తగ్గట్టుగా ఆయన గొప్ప పేరు కూడా వారసత్వం పొందాడు. దేవదూతలకన్నా కుమారుడు గొప్పవాడు. |
5
|
ఎందుకంటే దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ విధంగా అనలేదు: ‘నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినయ్యాను.’ కీర్తన 2:7 మరొక చోట: ‘నేనతనికి తండ్రి నౌతాను. అతడు నా కుమారుడౌతాడు.’ 2 సమూయేలు 7:14 |
6
|
మరొకచోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా అన్నాడు: ‘దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి!’ ద్వితీయోపదేశ 32:43 |
7
|
దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ: ‘దేవుడు తన దూతల్ని ఆత్నలుగాను తన సేవకుల్ని అగ్ని జ్వాలల్లా చేస్తాడు!’ కీర్తన 104:4 |
8
|
కాని కుమారుణ్ణి గురించి ఈ విధంగా అన్నాడు: “ఓ దేవా! నీ సింహాసనం చిరకాలం వుంటుంది. నీతి నీ రాజ్యానికి రాజదండంగా వుంటుంది. |
9
|
నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు. అందువల్ల దేవుడు! నీ దేవుడు ఆనందమనే నూనెతో నిన్ను అభిషేకించి నీ స్నేహితులందరి కన్నా నిన్ను అధికంగా గౌరవించాడు.” కీర్తన 45:6-7 |
10
|
ఆయనింకా ఈ విధంగా అన్నాడు: “ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు. ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు. |
11
|
అవి నశించి పోతాయి ఒక వస్త్రంలా పాత బడతాయి. కాని, నీవు చిరకాలం వుంటావు. |
12
|
వాటిని నీవు ఒక వస్త్రంలా మడుస్తావు. వాటిని నీవు దుస్తులు మార్చినట్లు మారుస్తావు. కాని నీవు మాత్రం అలాగే వుంటావు! నీ సంవత్సరములకు అంతంలేదు!” కీర్తన 102:25-27. |
13
|
దేవుడు ఏ దేవదూతతోనైనా: “నీ శత్రువుల్ని నీ పాద పీఠంగా చేసే వరకు నా కుడివైపు కూర్చో,” కీర్తన 110:1 అని ఎన్నడైనా అన్నాడా? |
14
|
ఈ దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన ఆత్మలే కదా! రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే గదా దేవుడు వీళ్ళను పంపింది? |
Hebrews 1:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...