1
|
దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు: “ఇశ్రాయేలు నాయకులను గురించి నీవు ఈ విషాద గీతం ఆలపించాలి: |
2
|
“‘నీ తల్లి ఆడసింహంలా, మగసింహాల మధ్య పడుకొని ఉంది. ఆమె యౌవ్వనంలో ఉన్న మగ సింహాలతో పడుకొని ఉంది. దానికి చాలా మంది పిల్లలున్నారు. |
3
|
ఆ సింహపు పిల్లల్లో ఒకటి లేచింది. అది బలమైన యువ సింహంలా తయారయ్యింది. అది తన ఆహారాన్ని వేటాడం నేర్చుకుంది. అది ఒక మనుష్యుని తినేసింది. |
4
|
అది గర్జించటం ప్రజలు విన్నారు. తాము పన్నిన బోనులో దానిని పట్టుకున్నారు! దాని నోటికి గాలం తగిలించారు. వారా కొదమ సింహాన్ని ఈజిప్టుకు తీసుకొని వెళ్లారు. |
5
|
“‘తల్లి తన యువసింహం నాయకత్వం వహిస్తుందనుకుంది. కాని ఆమె ఆశలు అడియాశలయ్యాయి. అందువల్ల ఆమె తన పిల్లల్లో మరో దానిని తీసుకుంది. దానిని యువ సింహంలా తీర్చిదిద్దింది. |
6
|
అది పెద్ద సింహాలతో కలిసి వేటకెళ్లింది. అది భయంకర సింహంలా తయారయ్యింది. అది తన ఆహారం వేటాడ నేర్చుకుంది. అది ఒక మనుష్యుని చంపి తినివేసింది. |
7
|
ఆది రాజభవనాల మీద దాడి చేసింది. అది నగరాలను నాశనం చేసింది. దాని గర్జన విన్న ప్రతివాడూ నోట మాట లేక నివ్వెరపోయాడు. |
8
|
అప్పుడు తనచుట్టూ నివసిస్తున్నవారు దానికైవలపన్నారు. అది వారి వలలో చిక్కిపోయింది. |
9
|
వారు దానికి కొక్కీలు వేసి బంధించారు. వారు దానిని తమ బోనులో ఇరికించారు. వారు దానిని బబులోను రాజు వద్దకు తీసుకొని పోయారు. అందువల్ల ఇశ్రాయేలు పర్వతాలలో ఇప్పుడు మీరు గర్జన వినలేరు. |
10
|
“‘మీ తల్లి నీటి పక్క నాటిన ద్రాక్షాలతలాంటిది. దానికి నీరు పుష్కలంగా ఉంది. అది చాలా ఫలభరితమైన దళమైన ద్రాక్షా తీగలతో పెరిగింది. |
11
|
ఆ పిమ్మట దానికి కొన్ని పెద్ద కొమ్మలు పెరిగాయి. అవి కొన్ని చేతికర్రల్లా ఉన్నాయి. ఆ కొమ్మ ఒక రాజదండాల్లా ఉన్నాయి. ఆ ద్రాక్షాలత అలా, అలా పొడుగ్గా, చాలా కొమ్మలతో మేఘాలను అంటేలా పెరిగింది. |
12
|
కాని ఆ ద్రాక్షా చెట్టు వేర్లతో పెరికివేయబడి, నేలమీద కూల్చి వేయబడింది. తూర్పుదిక్కు వేడిగాడ్పులు వీయగా దాని పండ్లు ఎండి పోయాయి. దాని పెద్ద కొమ్మలు విరిగి పోయాయి. అవి అగ్నిలో వేయబడ్డాయి. |
13
|
ఇప్పుడా ద్రాక్ష మొక్క ఎడారిలో నాటబడింది. అది నీరులేక, దాహం పుట్టంచే ప్రాంతం. |
14
|
దాని పెద్ద కొమ్మ నుండి నిప్పు చెలరేగింది. నిప్పు దాని రెమ్మలను, పండ్లను నాశనం చేసింది. అందుచే బలమైన చేతికర్రాలేదు; / రాజదండమూ లేదు’ ఇది ఒక విషాద గీతం. అది వినాశనాన్ని గూర్చిపాడబడింది.” |
Ezekiel 19:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...