ద్రాక్షా తోటల [*ద్రాక్షా తోట అనేక పర్యాయాలు ఇశ్రాయేలును దేవుని యొక్క ద్రాక్షతోట అని పిలిచారు.] నుంచి తెచ్చిన పుల్లలను ఏ పనికైనా నీవు వినియోగించగలవా? లేదు! ఆ కట్టెను పాత్రలు తగిలించేరాటలకైనా నీవు వినియోగించగలవా? లేదు!
ప్రజలా పుల్లలను కేవలం నిప్పులో వేస్తారు. కొన్ని పుల్లలు రెండు చివరలా మండుతూ మధ్య భాగం పొగకమ్మి నల్లబడతాయి. అంతేగాని పుల్లలు పూర్తిగా తగులబడవు. ఆ సగం కాలిన పుల్లతో నీవేమైనా చేయగలవా?
కావున ద్రాక్షా తోటలో తేచ్చిన పుల్లలూ కేవలం అడవిలో తెచ్చిన పుల్లల మాదిరే వుంటాయి. ప్రజలా పుల్లలను నిప్పులో వేస్తారు. నిప్పు వాటిని కాల్పివేస్తుంది. అదేరకంగా, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను నేను అగ్నిలో పడవేస్తాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“ఆ ప్రజలను నేను శిక్షిస్తాను. కాని వారిలో కొంతమంది పూర్తిగా కాలని పుల్లల వంటివారు. వారు శిక్షింపబడతారు. అంతేగాని వారు సర్వనాశనం చేయబడరు. నేను ఈ ప్రజలను శిక్షించటం నీవు చూస్తావు. ఆ శిక్షించింది యెహోవాయే అని కూడా నీవు తెలుసుకుంటావు!