1
|
పారసీక రాజగు కోరషు పాలన మూడవ సంవత్సరంలో, బెల్తెషాజరు అను ఒక విషయం దానియేలుకు తెలియపర్చబడింది. అది యుద్ధమును గూర్చిన నిజ సంగతి. ఇది దర్శనం ద్వారా దానియేలుకు బయలుపడింది గనుక అతడు గ్రహించాడు. |
2
|
“ఆ దినాల్లో దానియేలు అను నేను మూడు వారాలు దుఃఖాక్రాంతుడనయ్యాను. |
3
|
ఆ మూడు వారాల్లో, నేను ఎలాంటి పుష్ఠికరమైన ఆహారాన్ని భుజించలేదు, మాంసాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకోలేదు, తలకు నూనె రాసుకోలేదు. |
4
|
“ మొదటి నెల ఇరవై నాల్గవ రోజున, గొప్ప నది అయిన టెగ్రిసు (హిద్దెకెలు) నది గట్టుమీద నేను నిలబడి ఉన్నాను. |
5
|
నేనక్కడ నిలబడి కన్నులెత్తి చూస్తూండగా ఒక వ్యక్తి నార బట్టలు ధరించుకొని, నడుము చుట్టూ మేలిమి బంగారపు దట్టి ధరించుకొని యున్నాడు. |
6
|
ఆయన శరీరం గోమేధికం వలె పసుపు గాను, ముఖం మెరుపులవె ప్రకాశవంతంగాను, కళ్లు ప్రకాశిస్తున్న దీపాల వలె కనిపించాని. చేతులూ, కాళ్లూ మెరుస్తున్న కంచువలెను, మాటల శబ్ధం నర సమూహపు కంఠధ్వని వలెను ఉన్నాయి. |
7
|
“దానియేలు అను నేనొక్కడనే ఆ దర్శనం చూశాను. నా వెంట నున్న మనుష్యులు ఆ దర్శనం చూడలేదు. కాని వారు భయంతో వణుకుచూ పారిపోయి దాగుకొన్నారు. |
8
|
అందువల్ల నేను ఒంటరి వాడనై, ఆ గొప్ప దర్శనాన్ని చూచి, నాలో బలము లేనివాడనయ్యాను. మృతుడైన వాని ముఖంవలె నా ముఖం పాలిపోయి బలం లేని వాడనయ్యాను. |
9
|
దర్శనంలో కనిపించిన వ్యక్తి మాటలాడడం విన్నాను. ఆయన మాటలాడడం వినగా, నేను గాఢనిద్ర పొందిన వాడనె నేలమీద సాష్టాంగ పడ్డాను. |
10
|
“అప్పుడు ఒక చెయ్యి నన్ను తాకి, వణుకుచున్న నా చేతులను, మోకాళ్లను బలపరచి నన్ను నిలువ బెట్టింది. |
11
|
అతడు నాతో, ‘బహు ప్రియుడవైన దానియేలూ! నేను నీతో చెప్పు మాటల్ని జాగ్రత్తగా వినుము. సరిగా నిలువ బడు. నేను నీ కోసమే నీ యొద్దకు పంపబడ్డాను’ అని అన్నాడు. అతడు నాతో ఈ మాట చెప్పుచుండగా వణకుతూ నేను నిలబడ్డాను. |
12
|
అప్పుడు అతడు నాతో, ‘దానియేలూ, భయపడకు. నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని గ్రహించటానికి నీ మనస్సు నిలుపుకొన్న ఆ మొదటి రోజునుండి నీ మాటలు వినబడ్డాయి. నీవు ప్రార్థింస్తూన్నందువల్లనే నేను నీ వద్దకు వచ్చాను. |
13
|
పారసీక రాజ్యాధిపతి ఇరవై యొక్క రోజులు నన్ను అడ్డగించాడు. కాని ప్రధాన దూతలలో ఒకడైన మిఖాయేలు నా సహాయం కోసం వచ్చాడు. అతన్ని నేను పారసీక రాజ్యాధి పతియొద్ద విడిచి వచ్చాను. |
14
|
అంత్య దినాల్లో నీ జనులకు జరుగబోయే సంగతుల్ని నీకు తెలియ జేయటానికి నేను వచ్చాను. ఈ దర్శనం రాబోయే దినాలకు సంబధించింది’ అని చెప్పాడు. |
15
|
“ అతడు అలా మాటలాడుతూ ఉండగా, నా ముఖము నేలకు వంచి నేను మౌనంగా ఉంటిని. |
16
|
మానవ పుత్రులను పోలిన ఒకతను నా పెదవులు తాకాడు. నేను నా నోరు తెరిచి, మాటలాడటానికి ప్రారంభించాను. నేను నా ఎదుట నిలబడిన ఆ వ్యక్తితో, ‘అయ్యా, దర్శనంలో కనిపించిన వాటివల్ల బాధనొంది బలము లేని వాడనయ్యాను. |
17
|
అయ్యా! నీ సేవకుడనైన నేను నీతో ఎలా మాట్లాడగలను? నా బలంపోయింది. నాకు ఊపిరి ఆడనట్లయింది’ అని అన్నాను. |
18
|
“మానవునిలా కనిపించిన ఆ వ్యక్తి మళ్లీ నన్ను ముట్టి, బలపరిచాడు. |
19
|
అతడు నాతో, ‘బహు ప్రాయుడవయిన మనుష్యుడా! భయపడవద్దు. నీకు శాంతి కలుగునుగాక! శక్తివంతుడవై ధైర్యంగా ఉండు’ అని అన్నాడు. అతడు మాటలాడగానే నేను బలం పొంది ఇలాగన్నాను: ‘అయ్యా, నాకు నీవు శక్తినిచ్చావు. ఇప్పుడు నీవు మాట్లాడవచ్చును.’ |
20
|
“అప్పుడు అతను, ‘ దానియేలూ, నేను ఎందుకు నీవద్దకు వచ్చానో నీకు తెలుసా? నేను త్వరగా మరలి పోయి పారసీక రాజ్యాధిపతితో యుద్ధం చేయాలి. నేను వెళ్లినప్పుడు, గ్రీకు యువరాజు వస్తాడు. |
21
|
సత్య గ్రంథంలో ఏమి వ్రాయబడిందో అది నేను నీకు చెపుతాను. ఈ సంగతుల్లో మీ అధిపతి మిఖాయేలు తప్ప మరి యెవ్వరూ నా పక్షంగా నిలబడరు. |
Daniel 10:12 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...