1
|
ఇశ్రాయేలు ప్రజలారా, ఈ పాట వినండి. ఈ విలాపగీతం మిమ్మల్ని గురించినదే. |
2
|
ఇశ్రాయేలు కన్యక పతనమయింది. ఆమె ఇక లేవలేదు. మట్టిలోపడి ఆమె ఒంటరిగా వదిలి వేయబడింది. ఆమెను లేవనెత్తే వ్యక్తే లేడు. |
3
|
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “వెయ్యిమంది సైనికులతో నగరం వదిలివెళ్ళే అధికారులు కేవలం వందమంది మనుష్యులతో తిరిగి వస్తారు వందమంది సైనికులతో నగరం వదలి వెళ్లే అధికారులు కేవలం పదిమంది మనుష్యులతో తిరిగి వస్తారు.” |
4
|
ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెపుతున్నాడు: “నన్ను వెదుక్కుంటూ వచ్చి జీవించండి. |
5
|
కాని బేతేలులో వెదకవద్దు. గిల్గాలుకు వెళ్లవద్దు. సరిహద్దును దాటి బెయేర్షెబాకు వెళ్లకండి. గిల్గాలు ప్రజలు బందీలుగా తీసుకు పోబడతారు. బేతేలు నాశనం చేయబడుతుంది. |
6
|
యెహోవా దరిచేరి జీవించండి. మీరు యెహోవా వద్దకు వెళ్లకపోతే యోసేపు (పదివంశాలవారు) ఇంటిమీద నీప్పు పడుతుంది. ఆ అగ్ని యోసేపు ఇంటిని దగ్ధం చేస్తుంది. బేతేలులో చెలరేగిన ఆ అగ్నిని ఎవ్వరు ఆపలేరు. |
7
|
[This verse may not be a part of this translation] |
8
|
[This verse may not be a part of this translation] |
9
|
[This verse may not be a part of this translation] |
10
|
ప్రవక్తలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి ప్రజలు చేసే చెడ్డ పనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుచే ప్రజలా ప్రవక్తలను అసహ్యించుకుంటారు. ప్రవక్తలు మంచివైన సామాన్య సత్యాలను బోధిస్తారు. అందుచే ప్రజలు ఆ ప్రవక్తలను అసహ్యించుకుంటారు. |
11
|
మీరు ప్రజలనుండి అన్యాయంగా పన్నులు వసూలు చేస్తారు. మీరు పేదవారి నుండి గోధుమ మోపులను తీసుకుంటారు. ఈ ధనంతో మీరు చెక్కిన రాళ్లతో అందమైన ఇండ్లు కట్టుకుంటారు. కాని మీరు ఆ ఇండ్లలో నివసించరు. మీరు అందమైన ద్రాక్షాతోటలను నాటతారు. కాని మీరు వాటి నుండి ద్రాక్షారసం తాగరు. |
12
|
ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాల గురించి నాకు తెలుసు. మీరు నిజంగా కొన్ని ఘోరమైన పాపాలు చేశారు. మంచి పనులు చేసే ప్రజలను మీరు బాధించారు. చెడు చేయటానికి మీరు డబ్బు తీసుకుంటారు. బహిరంగ ప్రదేశాలలో పేదవారిని మీరు నెట్టివేస్తారు. |
13
|
ఆ సమయంలో తెలివిగల బోధకులు ఊరుకుంటారు. ఎందుకంటే అది చెడు కాలం గనుక. |
14
|
దేవుడు మీతోనే ఉన్నట్లు మీరు చెపుతారు. అందుచే మీరు మంచిపనులు చేయాలేగాని చెడు చేయరాదు. అప్పుడు మీరు బతుకుతారు. సర్వశక్తుడగు యెహోవా నిజంగా మీతోవుంటాడు. |
15
|
చెడును ద్వేషించు. మంచిని ప్రేమించు. న్యాయస్థానాలలో న్యాయాన్ని పునరుద్ధ రించండి. అప్పుడు యోసేపు వంశంలో మిగిలిన వారిమీద దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా కనికరం కలిగి ఉండవచ్చు. |
16
|
అందువలన నా ప్రభువును, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు ఈ విషయం చెపుతున్నాడు: “బహిరంగ ప్రదేశాలన్నిటిలోనూ ప్రజలు విలిపిస్తారు. ప్రజలు వీధులలో రోదిస్తారు. ఏడ్చేటందుకు ప్రజలు కిరాయి మనుష్యులను నియమిస్తారు. |
17
|
ద్రాక్షా తోటలన్నిటిలో ప్రజలు విలపిస్తారు. ఎందుకనగా నేను అటుగా వెళ్లి మిమ్మల్ని శిక్షిస్తాను.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు. |
18
|
మీలో కొంతమంది యెహోవా యొక్క ప్రత్యేక తీర్పు రోజును చూడగోరతారు. అ రోజున మీరెందుకు చూడగోరుతున్నారు. యెహోవా యొక్క ఆ ప్రత్యేక దినము మీకు చీకటిని తెస్తుందేగాని, వెలుగును కాదు! |
19
|
ఒక సింహపు బారినుండి తప్పించుకుపోయే వ్యక్తిపై ఎలుగుబంటి మీదపడినట్లు మీరుంటారు! ఇంటిలోకి వెళ్లి గోడమీద చేయి వేయగా పాము కరచిన వాని మాదిరి మీరుంటారు! |
20
|
కావున యెహోవా యొక్క ప్రత్యేక దినము చీకటిని తెస్తుంది గాని, వెలుగును కాదు. అది దుఃఖ సమయంగాని, సంతోష సమయంగాదు! ఆ రోజు మీకు వెలుగు ఏమాత్రమూ లేని కారు చీకటిగా ఉంటుంది. |
21
|
“మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను! నేను వాటిని అంగీకరించను! మీ ప్రార్థనా సమావేశాలపట్ల నేను సంతోషంగా ఉండను! |
22
|
మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా, నేను వాటిని స్వీకరించను! మీరు సమాధాన బలులుగా అర్పించే బలిసిన జంతువులవైపు నేను కనీసం చూడనైనా చూడను. |
23
|
మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడ నుండి తొలగించండి. మీ స్వరమండలము నుండి వచ్చే సంగీతాన్ని నేను వినను. |
24
|
మీ దేశమంతటా న్యాయం నీళ్లలా ప్రవహించేలా మీరు చేయాలి. మంచితనాన్ని ఎన్నడూ ఎండని నీటి వాగువలె ప్రవహించేలా చేయండి. |
25
|
ఇశ్రాయేలూ, నలుబది సంవత్సరాల పాటు నీవు ఎడారిలో నాకు బలులు, అర్పణలు సమర్పించావు. |
26
|
కాని మీరు మీ రాజు యొక్క సక్కూతు విగ్రహాలను, కైవాను విగ్రహాలను కూడ తీసికొని వెళ్లారు. పైగా మీకై మీరు ఆ నక్షత్రాన్ని మీ దేవునిగా చేసుకున్నారు. |
27
|
కావున దమస్కు (డెమాస్కస్) పట్టణం అవతలకి మిమ్మల్ని బందీలుగా పట్టుకుపోయేలా చేస్తాను. దేవుడును,సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఆ విషయాలు చెపుతున్నాడు. |
Amos 5:4 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...