1
|
యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మోయాబు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, ఎదోము రాజు యొక్క ఎముకలు సున్నమయ్యేలా మోయాబు వారు కాల్చివేశారు. |
2
|
కావున మోయాబులో నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని కెరీయోతు ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది. భయంకరమైన అరుపులు, బూర నాదాలు వవినబడతాయి. మోయాబు చనిపోతాడు. |
3
|
అలా నేను మోయాబు రాజులను నిర్మూలిస్తాను. మరియు మోయాబు నాయకులందరినీ నేను చంపివేస్తాను.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు. |
4
|
యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా వారుచేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, వారు యెహోవా ఆజ్ఞలను పాటించ నిరాకరించారు. వారాయన ఆజ్ఞలను స్వీకరించలేదు. వారి పూర్వీకులు అబద్ధాలను నమ్మారు. ఆ అబద్ధాలే యూదా ప్రజలను దేవుని అనుసరించకండా చేశాయి. |
5
|
కావున యూదాలో అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని యెరూషలేములోగల ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.” |
6
|
యెహోవా ఇది చెపుతున్నాడు: “ఇశ్రాయేలువారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే స్వల్పమైన వెండికొరకు వారు మంచివారిని, అమాయకులైన ప్రజలను అమ్మివేశారు. వారు ఒక జత చెప్పుల విలువకు పేదవారిని అమ్మివేశారు. |
7
|
పేద ప్రజలను మట్టికరిచేలా కిందికి తోసి, వారిపై తాము నడిచారు. బాధపడేవారి గోడును వారు ఆలకించరు. తండ్రులు, కొడుకులు ఒకే స్త్రీతో సంభోగిస్తారు. వారు నా పవిత్ర నామాన్ని పాడుచేసారు. |
8
|
పేద ప్రజలవద్ద వారు బట్టలు తీసుకొని, బలిపీఠాల ముందు ఆరాధన జరిపేటప్పుడు వాటిమీద కూర్చుంటారు. వారు పేదవారికి డబ్బు అప్పుగా ఇచ్చి, వారి దుస్తులను తాకట్టు పెట్టుకున్నారు. ప్రజలు అపరాధ రుసుము చెల్లించేలా వారు చేస్తారు. ఆ డబ్బును వారు తమ దేవుని అలయంలో తాగటానికి ద్రాక్షా మద్యం కొనడానికి వినియోగిస్తారు. |
9
|
“కాని అమోరీయులను వారి ముందర నాశనం చేసింది నేనే. అమోరీయులు దేవదారు వృక్షమంత ఎత్తయిన వారు. వారు సింధూర వృక్షమంత బలంగల వారు. కాని, పైన వాటి పండ్లును, కింద వాటి వేళ్లను నేను నాశనం చేశాను. |
10
|
ఈజిప్టు దేశం నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చినది నేనే. అమోరీయుల దేశాన్ని మీరు ఆక్రమించటంలో నేను మీకు సహాయం చేశాను. దీనికై నలబె సంవత్సరాలు మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. |
11
|
మీ కుమారులలో కొంత మందిని నేను ప్రవక్తలుగా చేశాను. యువకులలో కొంత మందిని నాజీరులుగా నియమించాను. ఇశ్రాయేలు ప్రజలారా ఇది నిజం.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు. |
12
|
“కాని నాజీరులు ద్రాక్షామద్యం తాగేలా మీరు చేశారు. దేవుని మాటలు ప్రకటించవద్దని మీరు ప్రవక్తలకు చెప్పారు. |
13
|
మీరు నాకు పెద్ద భారమైనారు. అధికమైన గడ్డివేసిన బండిలా నేను చాలా కిందికి వంగిపోయాను. |
14
|
ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎంత వేగంగా పరుగెత్తగలవాడైనా తప్పించుకోలేడు. బలవంతులు బలంగా లేరు. సైనికులు తమను తాము రక్షించుకోలేరు. |
15
|
విలంబులు, బాణాలు చేతబట్టిన వారు బ్రతకురు. వేగంగా పరుగిడ గలవారు తప్పించుకోలేరు. గుర్రాలు ఎక్కినవారు ప్రాణలతో తప్పించుకోలేరు. |
16
|
ఆ సమయంలో మిక్కిలి బలవంతులైన సైనికులు సహితం పారిపోతారు. వారు బట్టలు వేసుకొనటానికి కూడా సమయం తీసుకోరు.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు. |
Amos 2:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...