Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

2 Kings Chapters

2 Kings 7 Verses

Bible Versions

Books

2 Kings Chapters

2 Kings 7 Verses

1 దేవుని సందేశం వినండి. యెహోవా చెప్పుచున్నాడు. “రేపు ఈపాటికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అది మరల చౌకగా దొరకుతుంది. సమారియా నగర ద్వారం వద్ద ఒక రూపాయికి ఒక సన్నని మేలు రకం పిండి, ఇంకొక రూపాయికి రెండు బుట్టుల (సేరుల) యవలు అమ్మబడును.”
2 తర్వాత రాజుకి దగ్గరగా వున్న అధికారి దేవుని వ్యక్తి ఎలీషాకి సమాధానమిచ్చాడు. “పకలోకపు కిటికీలు యెహోవా తెరిచినా, ఇది జరగదు” అని ఆ అధికారి చెప్పాడు. “నీవు నీకళ్ళతో అది చూడగలవు. కాని ఆ ఆహారం కొంచమైనా నీవు తినలేవు” అని ఎలీషా చెప్పాడు.
3 నగర ద్వారం వద్ద నలుగురు కుష్ఠరోగులుండిరి. వారు ఒకరితో ఒకరు ఇట్లు చెప్పుకున్నారు: “కూర్చుని మరణించాడానికి నిరీక్షిస్తున్నామా?
4 షోమ్రోనులో ఆహారంలేదు. మనము నగరంలోకి వెళితే, మనమక్కడ చనిపోతాము. ఇక్కడ ఉంటే, చనిపోతాము. కనుక మనము సిరియనుల గుడారానికి వెళదాము. వాళ్లు కనుక మనలను అక్కడ ఉండనిస్తే, అప్పుడు మనం బతుకుదాము. వాళ్లు మనలను చంపితే మనము మరిణిద్దాము.”
5 అందువల్ల ఆ సాయంకాలం ఆ నలుగురు కుష్ఠరోగులు సిరియనుల గుడారానికి వెళ్లారు. వారు గుడారం అంచుదాకా వెళ్లారు. అక్కడ మనుష్యులైవ్వరూ లేరు.
6 సిరియనుల గుడారం వారు రథాలు, గుర్రాలు, సైన్యం వస్తున్న సవ్వడిని సిరియనుల సైన్యం వినేలా యెహోవా ఏర్పాటు చేశాడు. అందువల్ల సిరియనుల సైనికులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “ఇశ్రాయేలు రాజు హిత్తీయుల, ఈజీప్టుయుల రాజులను మనకు ప్రతికూలంగా జీతమిచ్చి వాడుకున్నాడు.”
7 ఆసాయంకాలమే సిరియావారు అన్నీ అక్కడే విడిచిపెట్టి పారిపోయారు. వారు తమ గుడారాలు విడిచిపెట్టారు. గుర్రాలు, గాడిదలు మొదలైనవి కూడా విడిచి పెట్టి ప్రాణాలకోసం పారిపోయారు.
8 శిబిరం ప్రారంభమైన చోటికి ఈ కుష్ఠరోగులు వచ్చారు. వారు ఒక గుడారంలోకి వెళ్లారు. వారు తిన్నారు; తాగారు. తర్వాత ఆ కుష్ఠరోగులు వెండి బంగారం వస్త్రాలు మొదలైన వాటిని తీసుకున్నారు. వెండి బంగారాలు వస్త్రాలు వారు దాచివేశారు. తర్వాత వెనక్కి వచ్చి మరొక గుడారంలో ప్రవేశించారు. ఈ గుడారం నుంచి వస్తువులను బయటకి చేరవేశారు. ఈ వస్తువులను కూడా వారు దాచివేశారు.
9 తర్వాత ఈ కుష్ఠరోగులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: “మనము తప్పు చేస్తున్నాము. నేడు మనకు మంచి వార్త కలదు. కాని మనము మౌనంగా ఉన్నాము. మళ్లీ సూర్యుడు వచ్చేంతవరకు మనము వేచివుంటే, మనము శిక్షింపబడతాము. ఇప్పుడే మనము వెళ్లిపోదాము. రాజు గారి భవనంలో వున్న మనష్యులకు చెపుదాము.”
10 ఆ తరువాత కుష్ఠరోగులు వచ్చి, నగర ద్వారపాలకులతో చెప్పారు: “మేము సిరియావారి శిబిరాలకు వెళ్లాము. కాని మేము ఎవ్వరి గొంతు వినలేదు. అక్కడ ఎవ్వరూ లేరు. గుర్రాలు గాడిదలు ఇంకా కట్టివేయబడివున్నాయి. గుడారాలు అలాగేవున్నాయి. కాని మనుష్యులందురూ వెళ్లిపోయారు.”
11 తర్వాత నగర ద్వారపాలకులు కేకలు వేసి రాజ భవనంలోని వారికి చెప్పారు.
12 అది రాత్రిగడియ. అప్పుడు రాజు పడక నుండి లేచాడు. తన అధికారులతో రాజు, “సిరియా సైనికులు మనకేమి చేస్తున్నారో మీకు చెప్తాను. మనము ఆకలిగా వున్నామని వారికి తెలుసు. పొలాలలో దాగుకొనడానికి వారు విడిదిని విడిచిపెట్టి వెళ్లారు. నగరం వెలుపలికి ఇశ్రాయేలువారు రాగానే, వారిని సజీవంగా మనము పట్టుకోవచ్చు, తర్వాత మనం నగరం ప్రవేశిద్దాము అని వారనుకొంటున్నారు” అని చెప్పాడు.
13 రాజు ఉద్యోగులలో ఒకడు, “నగరంలో ఇంకా మిగిలిన ఐదు గుర్రాలను కొంతమంది పురుషులు తీసుకొని పోనివ్వండి. ఆ గుర్రాలు ఎలాగైన మరణించేవే. నగరంలో ఇంకా మిగిలిన ఇశ్రాయేలువారివలె మరణించేవే, ఈవ్యక్తులను ఏమి జరిగిందో తెలుసుకోడానికి మనము పంపిద్దాము”అని చెప్పాడు.”
14 అందువల్ల గుర్రాలు కట్టిన రెండు రథాలను ఆ మనష్యులు తీసుకున్నారు. ఆ మనుష్యులను సిరియను సైన్యము వెనుక పంపాడు. “వెళ్లి ఏమి జరిగిందో చూడండి” అని రాజు చెప్పాడు.
15 యోర్దాను నదిదాకా ఆ మనష్యులు సిరియను సైన్యము వెనుకగా వెళ్లారు. ఆ మార్గమంతటా వస్త్రాలు ఆయుధాలు వున్నాయి. సిరియావారు ఆ వస్తువులను పారిపోయినప్పుడు వదిలి వేశారు. ఆ దూతలు వెనుకకు వెళ్లి షోమ్రోను చేరుకొని రాజుకు చెప్పారు.
16 తర్వాత ఆ ఇశ్రాయేలీయులు సిరియను శిబిరానికి పరిగేత్తుకుని వెళ్లి అక్కడినుండి విలువగల వస్తువులు తీసుకున్నారు. ప్రతి ఒక్కనికి వస్తువులు సమృద్ధిగా వున్నాయి. అందువల్ల యెహోవా చెప్పినట్లుగానే అది జరిగింది. ఒక్క రూపాయికి మేలిరకం పిండి ఒక బుట్టు మరియు ఒక్క రూపాయికి రెండు బుట్టుల యవలు అమ్మబడెను.
17 రాజు తన ఉద్యోగిని సన్నిహితుడయిన వారిని ద్వార సంరక్షణకు ఎంపిక చేసెను. కాని ప్ర జలు విరోధి శిబిరము నుండి వస్తువులను పొందడానికి పరుగెత్తి, వారు ఆ ఉద్యోగిని కిందికి తోసి అతని మీదగా నడిచారు. రాజు దేవుని వ్యక్తి అయిన ఎలీషా ఇంటికి వచ్చినప్పుడు, అతను చెప్పినట్లుగానే ఆ ఉద్యోగి మరిణించాడు.
18 ఎలీషా కూడ ఇలా సూచించాడు: “ఒక్క రూపాయికి మేలిరకం పిండి ఒక బుట్టల మరియు ఒక్కరూపాయికి రెండు బుట్టల యవల అమ్మబడెను. సమారియా నగర ద్వారములవద్దగల అంగడి వీధివద్ద ప్రతివారు కొనగలరు.”
19 కాని ఆ ఉద్యోగి దేవుని వ్యక్తికి చెప్పిన సమాధాన మేమిటంటేః “యెహోవా పరలోకపు కిటికిలు తెరచినా, ఇలా జరగదు” అని. ఎలీషా ఆ ఉద్యోగితో ఇలా చెప్పివుండెను. “నీవు నీ కళ్లతోనే చూడగలవు, కాని నీవు ఆ ఆహారమేమీ భుజింపవు.” 20ఆ విధంగానే, ఆ ఉద్యోగికి జరిగింది. ప్రజలు ద్వారం దగ్గర అతనిని కిందికి తోసి, అతని మీదగా నడిచారు. అతను మరణించాడు.
20 [This verse may not be a part of this translation]

2-Kings 7:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×