Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

2 Kings Chapters

2 Kings 1 Verses

Bible Versions

Books

2 Kings Chapters

2 Kings 1 Verses

1 అహాబు మరణానంతరం, ఇశ్రాయేలు మీద మోయాబు తిరుగుబాటు చేసింది.
2 ఒకరోజు షోమ్రోనులోని తన ఇంటి పై భాగాన అహాజ్యా ఉన్నాడు. ఆ ఇంటి కప్పునుండి కొయ్యకడ్డీల గుండా అహాజ్యా కిందపడి, బాగా గాయపడ్డాడు. అహాజ్యా తన దూతల్ని పిలిచి వాళ్లతో, “ఎక్రోను దేవుని బయల్దెబూబుల యాజకుల దగ్గరకి వెళ్లండి. నా గాయాలనుండి నేను బయట పడగలుగుతానో లేదో వారిని అడగండి” అనిచెప్పాడు.
3 కాని తిష్బీయుడైన ఏలీయాతో యెహోవా దూత ఇలా చెప్పాడు: “షోమ్రోను నుంచి అహాజ్యా రాజు కొందరు దూతలను పంపాడు. ఆ మనష్యుల్ని కలుసుకో. ‘ఇశ్రాయేలులో దేవుడున్నాడు. కనుక ఎక్రోను దేవుని బయల్దెబూబుల యాజకులను అడగ టానికి ఎందుకు మీరు అక్కడికి వెళుతున్నారు? అని వారిని అడుగుము.
4 మరియు అహజ్యా రాజుతో ఈ విషయాలు చెప్పమని ఆ దూతలకు ఆజ్ఞాపించుము. బలయల్దెబూబును అడగటానికి నీవు దూతలను పంపించావు. నీవీ విధంగా చేయడంవలన నీవు పడకనుంచి లేవవు, నీవు మరణిస్తావు అని యెహోవా చెప్పాడు.”‘ తర్వాత అక్కడనుంచి వెళ్లి ఆ మాటలు అహజ్యా సేవకులకు ఏలీయా చెప్పాడు.
5 దూతలు అహజ్యా దగ్గరకు వచ్చారు. “మీరింత త్వరగా ఎ ందుకు వచ్చారు?” అని అహజ్యా వారిని అడిగాడు.
6 దూతలు అహజ్యాతో ఇట్లన్నారు: “మమ్మల్ని కలుసుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. మమ్మల్ని పంపించిన రాజుకి యెహోవా చెప్పిన మాటలు చెప్పమని అతను చెప్పాడు. ‘ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు, అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్దెబూబుని ప్రశ్నలగటం దేనికి? ఇట్లు చేయటంవల్ల నీవు పడక నుండి లేవవనియు, నీవు మరణిస్తా వనియు యెహోవా చెప్పాడు!’ “
7 “మిమ్మల్ని కలుసుకుని మీకు ఈ మాటలు చెప్పిన ఆ వ్యక్తి ఎలా వున్నాడు?” అని అహజ్యా దూతలను అడిగాడు.
8 “ఆవ్యక్తి వెంట్రుకలతో చేసిన వస్త్రము ధరించాడు. నడుముకి ఒక తోలు నడికట్టు ధరించాడు” అని అహజ్యాకు దూతలు సమాధానమిచ్చారు. తర్వాత అహజ్యా, “తిష్బీయుడయిన ఏలీయానే ఆది” అని అన్నాడు.
9 అహజ్యా ఏలియా వద్దకు ఒక నాయకుని మరియు ఏభై మంది మనుష్యుల్ని పంపాడు. ఆ నాయకుడు ఏలీయావద్దకు వెళ్లాడు. అప్పుడు ఏలీయా ఒక కొండ పై భాగాన కూర్చొని వున్నాడు. నాయకుడు, దేవుని మనిషీ, ‘క్రిందికి దిగమని రాజు చెప్పాడు” అని పలికాడు.
10 ఏలీయా ఏభైమంది మనుష్యులును, ఆ నాయకుని చూచి, “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ, నీ ఏభై మందిని నాశనం చేయునుగాక” అన్నాడు. అందువల్ల పరలోకం నుండి అగ్ని వచ్చి ఆ నాయకుని, ఏభై మందిని నాశనం చేసింది.
11 అహజ్యా మరల ఏభై మందితో మరొక నాయకుని ఏలీయా వద్దకు పంపాడు. ఆ నాయకుడు ఏలీయాతో, “దేవుని మనిషీ క్రిందికి త్వరగా రమ్ము అని రాజు చెప్పాడు” అని పలికాడు.
12 ఏలీయా ఆ నాయకుని అతని ఏభై మంది మనుష్యులతో “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ నీ ఏభై మంది మనుష్యులను నాశనము చేయుగాక!” అన్నాడు. అప్పుడు దేవుని అగ్ని పరలోకం నుండి వచ్చి వారిని నాశనము చేసింది.
13 అహజ్యా మూడవ నాయకుని ఏభై మంది మనుష్యులతో పంపాడు. ఆ మూడవ నాయకుడు ఏలీయా వద్దకు వచ్చాడు. ఆ నాయకుడు మోకరిల్లి ఏలీయాను అర్థించాడు: “దేవుని మనిషీ, నా జీవితమూ నా ఏభై మంది సేవకుల జీవితములు నీకు విలువగలవై వుండునుగాక!
14 పరలోకం నుండి అగ్ని వచ్చి మొదటి ఇద్దరు నాయకులను వారి ఏభై మంది మనుష్యులను నాశనం చేసింది. మా మీద కరుణ చూపి మమ్ము బ్రతకనిమ్ము.”
15 యెహోవా దూత ఏలీయాతో, “ఆ నాయకునితో పొమ్ము, అతనికి భయపడకుము” అన్నాడు. అందువల్ల ఏలీయా ఆ నాయకునితో కూడా అహజ్యా రాజుని చూడటానికి వెళ్లాడు.
16 అహజ్యాతో ఏలీయా, “యెహోవా నీ విషయమై ఈలాగున చెప్పెను, ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు. అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్దెబూబు వద్దకు ప్రశ్నలడగమని దూతలను ఎందుకు పంపావు? నీవు ఇట్లు చేయడం వలన, నీవు నీ పడకనుండి లేవవు. నీవు మరణిస్తావు” అన్నాడు.
17 ఏలీయా ద్వారా యెహోవా చెప్పినట్లుగా అహజ్యా మరణించాడు. అహజ్యాకి కుమారుడు లేడు. అందువల్ల అహజ్యా తర్వాత యెహోరాము రాజయ్యాడు. యెహోషాపాతు. కుమారుడైన యెహోరాము పరిపాలించాసాగాడు. అతని రెండవ సంవత్సర పాలన కాలంలో యెహోషాపాతు యూదా రాజుగా వున్నాడు.
18 అహజ్యా చేసిన ఇతర పనులు ‘ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము’ అనే గ్రంథంలో వ్రాయబడినవి.

2-Kings 1:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×