1
|
దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానముచేయును. |
2
|
స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను |
3
|
జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను |
4
|
యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. |
5
|
దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. |
6
|
నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లుn నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. |
7
|
తన పరిశుద్ధత తోడని దేవుడు మాట యిచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను. |
8
|
గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజ దండము. |
9
|
మోయాబు నేను కాళ్లు కడగుకొను పళ్లెము ఎదోముమీదికి నా చెప్పువిసరివేయుదును ఫిలిష్తియనుబట్టి జయోత్సవము చేసియున్నాను. |
10
|
కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? |
11
|
దేవా, నీవు మమ్మును విడనాడి యున్నావుగదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావుగదా? |
12
|
మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము |
13
|
దేవునివలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. |
Psalms 108:2 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...