1
|
నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూ మునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. |
2
|
యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయు వాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును. |
3
|
యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. |
4
|
ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడి పోవును లెబానోను పుష్పము వాడిపోవును. |
5
|
ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు. |
6
|
ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవా డెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. |
7
|
యెహోవా ఉత్త ముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమి్మకయుంచువారిని ఆయన ఎరుగును. |
8
|
ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును, |
9
|
యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును. |
10
|
ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు. |
11
|
నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైనవాటిని బోధించినవా డొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు. |
12
|
యెహోవా సెలవిచ్చునదేమనగావారు విస్తారజనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూల మగుదురు; నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను. |
13
|
వారి కాడిమ్రాను నీమీద ఇక మోప కుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. |
14
|
నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చు నదేమనగానీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియు లేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. |
15
|
సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లిం పుము. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను. |
Nahum 1:3 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...