1
|
నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను...సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది. |
2
|
ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారువారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి. |
3
|
ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుముమరి యెవడు నా నిమిత్తము పూటపడును? |
4
|
నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివికావున నీవు వారిని హెచ్చింపవు. |
5
|
ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునోవాని పిల్లల కన్నులు క్షీణించును. |
6
|
ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడునలుగురు నా ముఖముమీద ఉమి్మవేయుదురు. |
7
|
నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెనునా అవయవములన్నియు నీడవలె ఆయెను |
8
|
యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురునిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. |
9
|
అయితే నీతిమంతులు తమ మార్గమును విడువకప్రవర్తించుదురునిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. |
10
|
మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడిమీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు. |
11
|
నా దినములు గతించెనునా యోచన నిరర్థకమాయెనునా హృదయ వాంఛ భంగమాయెను. |
12
|
రాత్రి పగలనియుచీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. |
13
|
ఆశ యేదైన నాకుండిన యెడల పాతాళము నాకుఇల్లు అను ఆశయే.చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను |
14
|
నీవు నాకు తండ్రివని గోతితోనునీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేనుమనవి చేయుచున్నాను. |
15
|
నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును? |
16
|
ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది. |
Job 17:4 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...