Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Job Chapters

Job 10 Verses

Bible Versions

Books

Job Chapters

Job 10 Verses

1 నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినదినేను అడ్డులేకుండ అంగలార్చెదనునా మనోవ్యాకులము కొలది నేను పలికెదను
2 నా మీద నేరము మోపకుండుమునీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను.
3 దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుటసంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?
4 నీ నేత్రములు నరుల నేత్రములవంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా?
5 నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములవంటివా?
6 నేను దోషిని కాననియునీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు
7 నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?
8 నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించి యున్ననునీవు నన్ను మింగివేయుచున్నావు.
9 జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?
10 ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదాజున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా.
11 చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివిఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.
12 జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివినీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.
13 అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయ ములో ఆలోచించితివిఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.
14 నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువునా దోషమునకు పరిహారము చేయకుందువు.
15 నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగునునేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొనినాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.
16 ­నేను సంతోషించినయెడలఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు.
17 సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువుఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవుఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవుఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.
18 గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండినయెడల మేలు;
19 అప్పుడు నేను లేనట్లే యుండియుందునుగర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.
20 నా దినములు కొంచెమే గదాతిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు
21 అంధకారము మరణాంధకారముగల దేశమునకు
22 కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకుభ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకువెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందుకొంతసేపు నేను తెప్పరిల్లునట్లునన్ను విడిచి నా జోలికి రాకుండుము.

Job 10:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×