1
|
యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను. |
2
|
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను. నేను నిరాశచెందను. నాశత్రువులు నన్ను చూచినవ్వరు. |
3
|
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు. కానీ నమ్మక ద్రోహులు నిరాశపడతారు. వారికి ఏమీ దొరకదు. |
4
|
యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము. నీ మార్గాలను ఉపదేశించుము. |
5
|
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము. నీవు నా దేవుడవు, నా రక్షకుడవు. రోజంతా నేను నిన్ను నమ్ముతాను. |
6
|
యెహోవా, నా ఎడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నాయెడల చూపించుము. |
7
|
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు. యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము. |
8
|
యెహోవా నిజంగా మంచివాడు. జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు. |
9
|
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు. న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు. |
10
|
యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను ఆనుసరించే మనుష్యులందరికి ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి. |
11
|
యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను. కానీ, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు. |
12
|
ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు. |
13
|
ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు. అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు. |
14
|
యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు. ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేసిస్తాడు. |
15
|
నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి. ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు. |
16
|
యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను. నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము. |
17
|
నా కష్టాలనుంచి నన్ను విడిపించుము. నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము. |
18
|
యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము. నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము. |
19
|
నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము, నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు. |
20
|
దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము. నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు. |
21
|
దేవా, నీవు నిజంగా మంచివాడివి నిన్ను నేను నమ్ముకొన్నాను కనుక నన్ను కాపాడుము. |
22
|
దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము. |
Psalms 25:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...