1
|
యెహోవాను స్తుతించండి! దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి! ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి! |
2
|
ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి! ఆయన గొప్పతనమంతటికోసం ఆయనను స్తుతించండి! |
3
|
బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి! స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి! |
4
|
తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి! తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి! |
5
|
పెద్ద తాళాలతో దేవుని స్తుతించండి! పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి! |
6
|
సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి! యెహోవాను స్తుతించండి. |
Psalms 150:2 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...