అప్పుడు బిలాము, “ఈ బలిపీఠం దగ్గరగా ఉండు. నేను ఇంకో చోటికి వెళ్తాను. అప్పుడు యెహోవా నా దగ్గరకు వచ్చి నేను చెప్పాల్సింది ఏమిటో నాకు చెబుతాడు” అని బాలాకుతో చెప్పాడు. అప్పుడు బిలాము మరో ఉన్నత స్థలానికి వెళ్లిపోయాడు.
అక్కడ దేవుడు బిలాము దగ్గరకు వచ్చాడు. “ఏడు బలిపీఠాలు నేను సిద్ధం చేసాను. ఒక్కో బలిపీఠంమీద ఒక్కో ఎద్దును ఒక్కోపొట్టేలును బలిగా నేను వధించాను” అన్నాడు బిలాము.
అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు: “తూర్పు కొండల్లో నుండి ఆరాము నుండి మోయాబు రాజైన బాలాకు నన్ను ఇక్కడకు తీసుకుచ్చాడు. వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు! ‘వచ్చి నా పక్షంగా యాకోబును శపించు, వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!’ అన్నాడు నాతో బాలాకు.
కొండమీద నుండి నేను ఆ ప్రజలను చూస్తున్నాను. ఎత్తయిన కొండల నుండి నేను చూస్తున్నాను. ఒంటరిగా బతుకుతున్న ప్రజలను నేను చూస్తున్నాను, వాళ్లు మరో జనములో భాగంకారు యాకోబు ప్రజలను ఎవరు లెక్కించగలరు.
ఇసుక రేణవులకంటె ఎక్కువ ఉన్నారు యాకోబు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్లో నాలుగోవంతు మనుష్యుల్ని కూడ ఎవరూ లెక్కించలేరు. ఒక మంచి మనిషిగా నన్ను చావనివ్వండి ఆ మనుష్యులు మరణించినంత సంతోషంగా నన్ను మరణించనివ్వండి!”
బాలాకు బిలాముతో, “ఏమిటి నీవు నాకు చేసింది? నా శత్రువుల్ని శపించమని నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ నీవు మాత్రం వాళ్లను ఆశీర్వదించావు” అన్నాడు.
అప్పుడు, “అలాగైతే, నాతో మరో చోటికి రా. అక్కడకూడ నీవు మనుష్యుల్ని చూడగలవు. అయితే అందర్నీ కాదుగాని కొందర్ని మాత్రం చూడగలవు. అక్కడనుండి నీవు నా కోసం వాళ్లను శపించవచ్చు” అని అతనితో చెప్పాడు బాలాకు.
కనుక బాలాకు యోఫీం పొలంలోకి బిలామును తీసుకుని వెళ్లాడు. ఇది పిస్గా కొండ శిఖరం మీద ఉంది. ఆ స్థలంలో బాలాకు ఏడు బలిపీఠాలు కట్టించాడు. అప్పుడు బాలాకు ఒక్కో బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బలిగా వధించాడు.
కనుక బిలాము బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు వారితోబాటు ఉన్నారు. అతడు రావటం చూచి, “ఏమి చెప్పాడు యెహోవా?” అన్నాడు బాలాకు.
దేవుడు మనిషికాడు, ఆయన అబద్ధం చెప్పడు. దేవుడు మానవ కుమారుడు కాడు, ఆయన నిర్ణయాలు మారవు. ఏదైనా చేస్తానని యెహోవా చెబితే ఆయన అలా చేస్తాడు. యెహోవా ఒక వాగ్దానం చేస్తే, ఆయన తన వాగ్దానం ప్రకారం చేస్తాడు.
దేవునికి యాకోబు ప్రజల్లో తప్పేమీ కనబడలేదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ పాపమూ దేవునికి కనబడలేదు. యెహోవా వారి దేవుడు, ఆయన వారితో ఉన్నాడు. మహారాజు వారితో ఉన్నాడు.
యాకోబు ప్రజలను ఓడించగల శక్తి ఏదీ లేదు. ఇశ్రాయేలు ప్రజలకు ఎదురు వెళ్లగల మంత్రమూ ఏదీ లేదు. ‘దేవుడు చేసిన మహా కార్యాలను చూడండి’ అని యాకోబును గూర్చి, ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మనుష్యులు అంటారు.
ఆ ప్రజలు బలమైన సింహంలా ఉంటారు. సింహంలా వారు పోరాడతారు. ఆ సింహం తన శత్రువును తినివేసేంత వరకు విశ్రాంతి తీసుకోదు. తనకు వ్యతిరేకంగా ఉండేవారి రక్తం తాగేంతవరకు ఆ సింహం ఊరుకోదు.”