English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Nehemiah Chapters

Nehemiah 10 Verses

1 అలా ముద్ర వేయబడిన ఒడంబడిన మీద ఉన్న పేర్లు ఇవి: పాలనాధికారి నెహెమ్యా, నెహెమ్యా హకల్యా కుమారుడు. సిద్కీయా,
2 శెరాయా, అజర్యా, యిర్మీయా,
3 పషూరు, అమర్యా, మల్కీయా,
4 హట్టూషు, షెబన్యా, మల్లూకు,
5 హరిము, మెరేమోతు, ఓబద్యా,
6 దానియేలు, గిన్నెతోను, బారూకు,
7 మెషుల్లాము, అబీయా, మీయామిను,
8 మయజ్యా, బిల్గయి, షెమయా. ఇవన్నీ ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన యాజకుల పేర్లు.
9 ముద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన లేవీయుల పేర్లు ఇవి: అజన్యా కుమారుడు యేషువా, హేనాదాదు వంశానికి చెందిన బిన్నూయి, కద్మీయేలు,
10 వాళ్ల సోదరులు: షెబన్యా, హోదీయా, కెలీటా,పెలాయా, హానాను,
11 మీకా, రెహోబు, హషబ్యా,
12 జక్కూరు, షేరేబ్యా, షెబన్యా,
13 హోదీయా, బానీ, బెనీను.
14 ముద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు చేసిన నాయకుల పేర్లు: పరోషు, పహత్నోయాబు, ఏలాము, జత్తూ, బానీ,
15 బున్నీ, అజ్గాదు, బేబై,
16 అదోనీయా, బిగ్వయి, అదీను,
17 అటేరు, హిజ్కియా, అజ్జూరు,
18 హోదీయా, హాషుము, బేజయి,
19 హారీఫు, అనాతోతు, నేబై,
20 మగ్పీయాషు, మెషుల్లాము, హెజీరు,
21 మెషేయేలు, సాదోకు, యద్దూవ,
22 పెలట్యా, హానాను, అనాయా,
23 హోషేయ, హనన్యా, హష్షూబు,
24 హల్లోహెషు, పిల్హా, షోబేకు,
25 రెహూము, హషబ్నా, మయశేయా,
26 అహీయా, ఆనాను, అనాను,
27 మల్లూకు, హరీము, బయనా.
28 (28-29) ఈ విధంగా, ఇప్పుడు వీళ్లందరూ దేవునికి ఈ ప్రత్యేక ప్రమాణం చేస్తున్నారు. తమ ఈ ప్రమాణాన్ని నిలుపుకోకపోతే, తామందరికీ చెడు, కీడు జరపమని వీళ్లంతా అర్థించారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్ర నియమాలను అనుసరిస్తాయని ప్రయాణం చేస్తున్నారు ధర్మశాస్త్రం దేవుని సేవకుడైన మోషే ద్వారా మాకు ప్రసాదించబడింది. మన దేవుడైన యెహోవా ఆదేశాలను, నియమ నిబంధనలను, ఉపదేశాలను అన్నింటినీ విధేయతతో పాటిస్తామని వీళ్లందరూ ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణం చేస్తున్నది ఈ మనుష్యులే: మిగిలిన వాళ్లు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, ఆలయ సేవకులు, తమచుట్టూ నివసిస్తున్నవారినుంచి తమని తాము వేరు చేసుకున్న ఇశ్రాయేలీయులందరూ తాము దేవుని ధర్మశాస్త్రాన్ని విదేయతతో పాటించేందుకుగాను వాళ్లు తమని తాము వేరు చేసుకున్నారు. అంతేకాదు, వాళ్లందరి భార్యలు, విని అర్థం చేసుకోగల వాళ్లందరి కొడకులు, కూతుళ్లు కూడా తమని తాము వేరు చేసుకున్నారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని ప్రమాణం చేసేందుకుగాను తమ సోదరులతోనూ, పెద్దలతోనూ జతకూడారు. తాము దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, తమకి కీడు కలిగించే శాపాన్ని తలదాల్చేందుకు కూడా సిద్ధపడ్డారు.
30 “మా చుట్టు పక్కల వున్న ఇతర ప్రజలను మా కూతుళ్లు పెళ్లి చేసుకోకుండా, అలాగే మా కొడుకులు ఇతర ప్రజల కూతుళ్లను పెళ్లి చేసుకోకుండానూ చూస్తామని మేము ప్రమాణం చేస్తున్నాము.
31 “మేము సబ్బాతు (విశ్రాంతి) రోజున పని చేయ మని ప్రమాణం చేస్తున్నాము. మా చుట్టూ ఉన్న ఇతర ప్రజలు సబ్బాతు రోజున తిండి గింజలో, ఇతర వస్తువులో అమ్మకానికి తెస్తే ఆ ప్రత్యేక దినానగాని, మరే ఇతర పండగ దినాల్లోగాని మేము వాటిని కొనము. ప్రతి ఏడేళ్లకీ ఒకసారి ఇతరులు మాకియ్యవలసిన బాకీ మొత్తాలను రద్దు చేస్తాము.
32 “దేవుని ఆలయం విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్న ఆదేశాల మేరకు మేమా బాధ్యతను స్వీకరిస్తాము. దేవునికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేందు కోసం మేము ప్రతియేటాతులము వెండిలో [*తులము వెండి బహుశా యిది ఆ కాలపు నాణెం అయ్యుంటుంది. ఇది ఒక ఔన్సులో 2/5 భాగము 11.5 గ్రాములు.] మూడోవంతు ఇస్తాము.
33 ఆలయంలో వారు బల్లమీద పెట్టే ప్రత్యేక రొట్టెకోసం, ప్రతి రోజూ అర్పించే ధాన్యార్పణలు దహనబలుల కోసం ఈ సొమ్ము యాజకులచేత వినియోగించబడుతుంది. అలాగే, ఈ సొమ్ము నవధాన్యాలు కొనేందుకు ధూప దీపాలు పెట్టేందుకు ఉపయోగింపబడుతుంది. సబ్బాతు రోజుల్లో, అమావాస్య [†అమావాస్య ఇది హిబ్రూ నెల మొదటి రోజు. దేవుని ఆరాధన కోసం ఆ రోజున ప్రత్యేకమైన సమావేశాలు జరుగుతాయి.] దినాల్లో నైవేద్యం నిమిత్తం ఈ సొమ్ము వినియుక్తమవుతుంది. అది పవిత్ర బలులకోసం, ఇశ్రాయేలీయులను పరిశుద్ధులను చేసే పాపపరిహారార్థ బలులకోసం వినియోగింప బడుతుంది.
34 “యాజకులము, లేవీయులము, సామాన్య జనమైన మనము చీట్లు [‡చీట్లు నిర్ణయాలు తీసుకునేందుకు పాచికల మాదిరి గా కర్రపుల్లలు, రాళ్లు, గవ్వలు వేయడం. సామెతలు 16:33 చూడండి.] వేసుకున్నాము. తద్వారా, మా కుటుంబాల్లో ఏటా మన ఆలయానికి ఏయే నిర్ణీతదినాల్లో కట్టెల మోపులు (సమిధలు) తేవాలో తెల్సుకున్నాము. ఆ కట్టెలు మన దేవుడైన యెహోవా గట్టు మీద హోమం కోసం తెచ్చేవి. అదంతా మేము సరిగ్గా ధర్మశాస్త్రంలో వ్రాసిన నిబంధనల ప్రకారం చెయ్యాలి.
35 “మా పంట చేలనుంచీ, ప్రతి ఒక్క ఫల వృక్షం నుంచీ తోలి ఫలాలను ఏటా యెహోవా ఆరాధనాలయానికి తెచ్చి ఇచ్చే బాధ్యతను మేము స్వీకరిస్తున్నాము.
36 “ధర్మశాస్త్రంలో సరిగ్గా లిఖించబడినట్లే, మేమిలా చేస్తాము: మా తొలిచూలు కొడుకుల్నీ, అలాగే, మొదటి ఈత ఆవుల దూడల్నీ, గొర్రెలు, మేకల పిల్లల్నీ మన దేవుని ఆలయానికి, మన యాజకుల దగ్గరికి తెస్తాము.
37 “యెహోవా ఆలయపు సరుకుల కొట్ల దగ్గరికి తెచ్చి, ఈ కింది వస్తువులు యాజకులకి సమర్పిస్తాము: మొదటివిడత ఆడిన పిండి, ధాన్యార్పణలో మొదటి భాగం, మా ఫల వృక్షాలన్నింటి మొదటి పండ్లు మా కొత్త ద్రాక్షారసం నుంచీ, నూనె నుంచీ మొదటి భాగం, మా పంటల్లొ పదోవంతును లేవీయులకి సమర్పిస్తాము. మేము పనిచేసే ఆయా ప్రాంతాల్లో లేవీయులు వీటిని వసూలు చేస్తారు. అందుకే మేము వారికి ఇస్తాము.
38 ఆ పంట భాగాలు లేవీయులు వసూలు చేసేటప్పుడు, వాళ్లతో అహరోను వంశానికి చెందిన యాజకుడొకడు ఉండాలి. తర్వాత ఆ లేవీయులు ఆ పంటల్ని విధిగా ఆలయానికి తీసుకురావాలి. అప్పుడు వాటిని వాళ్లు ఆలయపు ఖజానాలోని సరుకుల కొట్లలో ఉంచుతారు.
39 ఇశ్రాయేలీయులు, లేవీయులు తమ ఆహార ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, నూనె కానుకలను సరుకుల గదుల వద్దకు తెస్తారు. ఆలయానికి తెచ్చే వస్తువులన్నీ అక్కడ ఉంచబడతాయి. సేవలో వున్న యాజకులు అక్కడే ఉంటారు. గాయకులు, ద్వారపాలకులు కూడా అక్కడేవుంటారు. “మా దేవుని ఆలయాన్ని భద్రంగా చూసు కుంటామని మేమంతా ప్రమాణం చేశాము!”
×

Alert

×