1
|
అయితే యోబూ, దయచేసి నా సందేశాన్నివిను. నేను చెప్పే మాటలు గమనించు. |
2
|
త్వరలోనే నేను మాట్లాడటం మొదలు పెడతాను. చెప్పటానికి నేను దాదాపు సిద్ధంగా ఉన్నాను. |
3
|
నా హృదయం నిజాయితీ గలది. కనుక నిజాయితీగల మాటలను నేను చెబుతాను. నాకు తెలిసిన సంగతులను గూర్చి నేను సత్యం చెబుతాను. |
4
|
దేవుని ఆత్మ నన్ను చేసింది. నా జీవం సర్వశక్తిమంతుడైన దేవుని నుండి వచ్చింది. |
5
|
యోబూ, విను. నీవు చెప్పగలవనుకొంటే నాకు జవాబు చెప్పు. నీవు నాతో వాదించగలిగేందుకు నీ జవాబులు సిద్ధం చేసుకో. |
6
|
దేవుని ఎదుట నీవు, నేను సమానం. మన ఇద్దరిని చేసేందుకు దేవుడు మట్టినే ఉపయోగించాడు. |
7
|
యోబూ, నన్ను గూర్చి భయపడకు. నేను నీ యెడల కఠినంగా ఉండను. |
8
|
కాని యోబూ, నీవు చెబుతూండగా నేను విన్నది ఇదే. |
9
|
నీవు అన్నావు: ‘యోబు అనే నేను నిర్దోషిని, నేను పాపం చేయలేదు. లేక ఏ తప్పు చేయలేదు. నేను దోషిని కాను. |
10
|
నేను ఏ తప్పు చేయక పోయినప్పటికి దేవుడు నాలో ఏదో తప్పుకనుగొన్నాడు. యోబు అనేనేను దేవుని శత్రువును అని ఆయన తలుస్తున్నాడు. |
11
|
కనుక దేవుడు నా పాదాలకు సంకెళ్లు వేస్తున్నాడు. నేను చేసేది సమస్తం దేవుడు గమనిస్తున్నాడు. |
12
|
“కాని యోబూ, దీని విషయం నీది తప్పు అని నేను నీ తో చెప్పాలి. ఎందుకంటే దేవునికి అందరి కంటే ఎక్కువ తెలుసు కనుక. |
13
|
యోబూ, నీవు ఎందుకు ఆరోపణ చేస్తూ దేవునితో వాదిస్తావు? దేవుడు చేసే ప్రతిదాని గూర్చీ ఆయన నీకు వివరించటం లేదని నీవెందుకు ఆలోచిస్తావు? |
14
|
అయితే దేవుడు చేసే దాన్ని గూర్చి ఆయన వివరిస్తాడు. దేవుడు వేరువేరు విధానాలలో మాట్లాడతాడు. కానీ మనుష్యులు దాన్ని గ్రహించరు. |
15
|
[This verse may not be a part of this translation] |
16
|
[This verse may not be a part of this translation] |
17
|
మనుష్యులు చెడు సంగతులు జరిగించటం మాని వేయాలని, గర్విష్టులు, కాకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తాడు. |
18
|
“మనుష్యులు మరణస్థానానికి వెళ్లకుండా రక్షించాలని హెచ్చరిస్తాడు. ఒక వ్యక్తి నాశనం చేయబడకుండా రక్షించటానికి దేవుడు అలా చేస్తాడు. |
19
|
“లేక ఒక వ్యక్తి పడగ మీద ఉండి దేవుని శిక్ష అనుభవిస్తుప్పుడు దేవుని స్వరం వినవచ్చును. ఆ వ్యక్తిని దేవుడు బాధతో హెచ్చరిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎముకలన్నీ నొప్పి పెట్టిన ట్లు అతడు బాధ పడుతున్నాడు. |
20
|
ఆ వ్యక్తి భోజనం చేయలేడు. శ్రేష్టమైన భోజనం కూడ అసహ్యించుకొనేంతగా అతడు బాధ పడతాడు. |
21
|
అతని చర్మం వేలాడేటంతగా, అతని ఎముకలు పోడుచుకొని వచ్చేంతగా అతని శరీరం పాడైపోతుంది. |
22
|
ఆ మనిషి ఖనన స్థలానికి సమీపంగా ఉన్నాడు. అతని జీవితం చావుకు దగ్గరగా ఉంది. |
23
|
“కాని ఒకవేళ ఆ మనిషికి సహాయం చేయటానికి ఒక దేవదూత ఉండునేమో. నిజంగా దేవునికి వేలాది దూతలు ఉంటారు. అప్పుడు ఆ దూతలు ఆ మనిషి చేయాల్సిన సరియైన సంగతిని అతనికి తెలియజేస్తాడు. |
24
|
మరియు ఆ దేవదూత ఆ మనిషి ఎడల దయగాఉంటాడు, ‘ఈ మనిషిని చావు స్థలం నుండి రక్షించండి. అతని పక్షంగా చెల్లించేందుకు నేను ఒక మార్గం కనుగొన్నాను’ |
25
|
అప్పుడు ఆ మనిషి శరీరం మరల యవ్వనాన్ని, బలాన్ని పొందుతుంది. ఆ మనిషి యువకునిగా ఉన్నప్పటివలెనే ఉంటాడు. |
26
|
ఆ మనిషి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని ప్రార్థన వింటాడు. అప్పుడు ఆ మనిషి దేవుని ఆరాధిస్తూ సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే, దేవుడు అతనికి సహజమైన మంచి జీవితాన్ని మరల ఇస్తాడు గనుక. |
27
|
అప్పుడు ఆ మనిషి ప్రజల దగ్గర ఒప్పుకొంటాడు. అతడు చెబుతాడు, ‘నేను పాపం చేశాను. మంచిని నేను చెడుగా మార్చాను. కానీ దేవుడు శిక్షించాల్సి నంత కఠినంగా నన్ను శిక్షించలేదు. |
28
|
నా ఆత్మ ఖనన స్థలానికి వెళ్లకుండా దేవుడు నన్ను రక్షించాడు. నేను చాలాకాలం జీవిస్తాను. నేను మరల జీవితాన్ని అనుభవిస్తాను.’ |
29
|
“ఒక మనిషికి దేవుడు ఈ సంగతులను మరల మరల చేస్తాడు. |
30
|
ఆ మనిషిని హెచ్చరించి, అతని ఆత్మను మరణ స్థలం నుండి రక్షించేందుకు. అప్పుడు ఆ మనిషి తన జీవితాన్ని అనుభవించవచ్చు. |
31
|
“యోబూ, నా మాట గమనించు. నా మాటవిను. మౌనంగా ఉండి, నన్ను మాట్లాడనియ్యి. |
32
|
యోబూ, నీవు చెప్పాల్సింది ఏమైనా ఉంటే నన్ను వినని. ఎందుకంటే, నీవు నిర్దోషిని అని రుజువు చేయగోరుతున్నాను గనుక. నీ వాదాన్ని సరిదిద్దేలాగా నాకు వినిపించు. |
33
|
కానీ యోబూ, నీవు చెప్పాల్సింది ఏమీ లేకపోతే నా మాట విను. మౌనంగా ఉండు, జ్ఞానం గలిగి ఉండటం ఎలాగో నేను నేర్పిస్తాను.” |
Job 33:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...