English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Job Chapters

Job 31 Verses

1 “ఒక యువతిని కామవాంఛతో చూడ కూడదని నా కళ్లతో నేను ఒప్పందం చేసుకొన్నాను.
2 సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తున్నాడు? దేవుడు ఉన్నతమైన తన పరలోక గృహంలో ఉండి ప్రజలకు తిరిగి ఎలా ప్రతిఫలం ఇస్తున్నాడు?
3 దుర్మార్గులకు దేవుడు కష్టాన్ని, నాశనాన్ని పంపిస్తాడు. తప్పు చేసేవారికి సర్వనాశనం కలిగిస్తాడు.
4 నేను చేసేది ప్రతిదీ దేవునికి తెలుసు. నేను వేసే ప్రతి అడుగూ ఆయన చూస్తున్నాడు.
5 “నేను అబద్ధాల జీవితం జీవించి ఉంటే, లేక ప్రజలకు అబద్దాలు చెప్పి, మోసం చేసేందుకు నేను పరుగులెత్తి ఉంటే.
6 అప్పుడు నన్ను తూచేందుకు దేవుడు న్యాయపుత్రాసు వాడవచ్చును. అప్పుడు నేను నిర్దోషినని దేవునికే తెలుస్తుంది.
7 నేను సరియైన మార్గం నుండి తొలగిపోతే నా కళ్లు నా హృదయాన్ని దుష్టత్వానికి నడిపించి ఉంటే లేదా నా చేతులు పాపంతో మైలగా ఉంటే,
8 అప్పుడు నేను నాటిన పంటలను ఇతరులు తిని వేయుదురు గాక, నా పంటలు పెరికి వేయబడును గాక.
9 “నేను స్త్రీల పట్ల కామవాంఛ కలిగి ఉంటే లేదా నేను నా పొరుగువాని భార్యతో వ్యభిచార పాపం చేయటానికి అతని ద్వారం దగ్గర వేచి ఉంటే,
10 అప్పుడు నా భార్య మరొకనికి వంట చేయునుగాక. ఇతర వురుషులు ఆమెతో పండుకొందురు గాక.
11 ఎందుకంటే లైంగిక పాపం అవమానకరం. అది శిక్షించబడాల్సిన పాపం.
12 లైంగికపాపం కాల్చివేసి, నాశనంచేసే అగ్నిలాంటిది. లైంగిక పాపంనాకు గల సర్వాన్నీ నాశనం చేస్తుంది.
13 “నా మగ సేవకులు, ఆడ సేవకులు నాకు విరోధంగా ఆరోపణ చేసినప్పుడు, ఒక వేళ నేను వారికి న్యాయం చేకూర్చేందుకు నిరాకరిస్తే,
14 నేను దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేను ఏమి చేస్త్తాను? నేను చేసిన దాని గూర్చి వివరించు మని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబిస్తాను?
15 దేవుడు నన్ను నా తల్లి గర్భంలోనే చేశాడు. నా సేవకులను కూడా దేవుడే చేసాడు. మమ్ముల్ని ఇద్దరినీ మా తల్లి గర్భంలో దేవుడే రూపొందిచాడు.
16 “పేద ప్రజలకు సహాయం చేసేందుకు నేను ఎన్నడూ నిరాకరించలేదు. విధవలను దిక్కుమాలిన వారిగా నేను ఎన్నడూ ఉండనియ్యలేదు.
17 నా భోజనం విషయంలో నేను ఎన్నడూ స్వార్థంతో ఉండలేదు. అనాధ పిల్లలను నేను ఎన్నడూ ఆకలితో ఉండనీయలేదు.
18 నా జీవిత కాలం అంతా తండ్రిలేని పిల్లలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను. నా జీవిత కాలం అంతా విధవల పట్ల నేను శ్రద్ధ చూపాను.
19 ఎవరో ఒకరు బట్టలు లేక శ్రమపడటం నేను చూచినప్పుడు, లేక పేదవాడు చొక్కా లేకుండా ఉన్నప్పుడు,
20 నేను ఎల్లప్పుడూ వారికి బట్టలు ఇచ్చాను. వారికి వెచ్చదనం కోసం నా గొర్రెల స్వంతబొచ్చు నేను ఉపయోగించాను. అప్పుడు వారు హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదించారు.
21 న్యాయస్థానంలో నేను గెలుస్తానని తెలిసికూడ ఒక అనాధ బిడ్డను నేను మోసం చేస్తే,
22 నేను ఒకవేళ అలాచేస్తే నా భుజం నుండి నా చేయి ఊడి పడిపోవును గాక. నా చేయి దాని కీలు నుండి పడిపోవును గాక.
23 కాని ఆ చెడ్డ పనులు ఏవీ నేను చేయలేదు. ఎందుకంటే, దేవుని శిక్షకు నేను భయపడ్డాను. ఆయన మహాత్మ్యము నన్ను బెదరగొట్టేను.
24 “నా ఐశ్వర్యాలను నేను ఎన్నడూ నమ్ముకొనలేదు. ‘నీవే నా ఆశ అని’ స్వచ్ఛమైన బంగారంతో నేను ఎన్నడూ చెప్పలేదు.
25 నేను ధనికుడను అని ఎన్నడు గర్వంతో నిండి పోలేదు. లేక నేను సంపాదించిన ఐశ్వర్యాలతో మురిసిపోలేదు.
26 నేను ఎన్నడూ ప్రకాశమైన సూర్యుణ్ణి లేక అందమైన చంద్రుణ్ణి ఆరాధించలేదు.
27 సూర్య చంద్రులకు భక్తితో పూజ చేసేందుకు నేను ఎన్నడూ మోసగించబడలేదు.
28 అలాంటిని ఏవైనా, ఎన్నడైనా నేను చేసి ఉంటే అవి నేను శిక్షించబడాల్సిన పాపాలే. ఎందుచేత నంటే ఆ చెడు కార్యాలు చేయటం మూలంగా సర్వశక్తిమంతుడైన దేవునికి నేను అపనమ్మకమైన వాడినవుతాను.
29 “నా శత్రువులు నాశనం చేయబడినప్పుడు నేను ఎన్నడూ సంతోషించలేదు. నా శత్రువులకు కష్టాలు కలిగినప్పుడు నేను ఎన్నడూ నవ్వలేదు.
30 నా శత్రువులను శపించటం ద్వారానూ, వారుచావాలని కోరుకోవటం ద్వారానూ, నేను ఎన్నడూ నా నోటితో పాపం చేయలేదు.
31 పరాయి వాళ్లకు నేను ఎల్లప్పుడూ భోజనం పెట్టినట్లు నా ఇంట్లోని వాళ్లందరకూ తెలుసు.
32 పరాయి వాళ్లు రాత్రి పూట వీధుల్లో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా నేను అలాంటి వారిని ఎల్లప్పుడూ నా ఇంటికి ఆహ్వానించేవాడను.
33 ఇతరులు తమ పాపాలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కాని నేను నా దొషాన్ని దాచిపెట్టలేదు.
34 ఎందుకంటే, ప్రజలు ఏమనుకుంటారో అని నేను ఎన్నడూ భయపడలేదు. నేను ఎన్నడూ మౌనంగా ఉండలేదు. బయటకు వెళ్లకుండా ఉండలేదు. ఎందుకంటే, ప్రజలు నన్ను ద్వేషిస్తారనే భయంనాకు లేదు గనుక.
35 “ఆహా, ఎవరైనా నా మాటలు వినేవారు ఉంటే బాగుండును. ఇప్పుడు నేను నా వాదం చెబుతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు జవాబిచ్చును గాక. నన్ను నిందించే ఆయన, నేను చేశానని నిందించబడుతున్న సంగతులను రాసి పెట్టును గాక.
36 నిశ్చయంగా ఆ రాతను నేను నా భుజం మీద ధరిసాను. నేను దానిని కిరీటంలా ధరిస్తాను.
37 నేను చేసినది సమస్తం దేవునికి నేను వివరిస్తాను. నేను ఒక అధికారిలా నా తలపైకి ఎత్తుకొని దేవుని దగ్గరకు వస్తాను.
38 “నేను సాగుచేస్తున్న భూమిని దాని సొంతదారుని దగ్గర దొంగిలించి తీసుకొని ఉంటే, ఆ భూమిదాని సొంత కన్నీళ్లతో తడిసి ఉంటే,
39 ఆ భూమి పండించిన వాటిని రైతులకు విలువ చెల్లించకుండానే నేను దొంగిలించి ఉంటే,
40 అవును, ఈ చెడుకార్యాలు నేను కనుక చేసి ఉంటే పొలాల్లో గోధుమకు బదులు ముండ్లు, యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక!” యోబు మాటలు సమాస్తం.
×

Alert

×