1
|
అప్పుడు నయమాతీ దేశపువాడైన జోఫరు యోబుకు జవాబిచ్చాడు: |
2
|
“ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సిందే! ఈ వాగుడు అంతా కలిసి, యోబు చెప్పింది సరే అనిపిస్తోందా? లేదు. |
3
|
యోబూ, నీకు చెప్పేందుకు మా పద్ద జవాబు లేదనుకొంటున్నావా? నీవు దేవునిగూర్చి నవ్వి నప్పుడు, నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు అనుకొంటున్నావా? |
4
|
యోబూ! నీవు దేవునితో, ‘నా నమ్మకాలు సరి యైనవే, కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు. |
5
|
యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి, నీవు చేసేది తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశిస్తున్నాను. |
6
|
అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్పగలడు. ప్రతి విషయానికీ, నిజంగా రెండు వైపులు ఉంటాయని ఆయన నీతో చెబుతాడు. అది నిజమైన జ్ఞానం! యోబూ! ఇది తెలుసుకో: దేవుడు నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంటె తక్కువగానే శిక్షిస్తున్నాడు. |
7
|
“యోబూ, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించగలవా? సర్వశక్తిమంతుడైన దేవుని గొప్పదనాన్నీ, శక్తినీ చూపించే హద్దులను నీవు గ్రహించలేవు. |
8
|
అతని జ్ఞానం ఆకాశమంత ఎత్తయినది! ఆ హద్ధులు సమాధి లోతులకంటె లోతైనవి. కానీ, అది నీవు గ్రహించలేవు! |
9
|
దేవుడు భూమికంటే గొప్పవాడు, సముద్రంకంటే పెద్దవాడు. |
10
|
“దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయ స్థానానికి తీసుకొనివస్తే, ఏ మనిషీ ఆయనను వారించలేడు. |
11
|
నిజంగా, ఎవరు పనికిమాలిన వాళ్లో దేవునికి తెలుసు. దేవుడు దుర్మార్గాన్ని చూసినప్పుడు, ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొంటాడు. |
12
|
ఒక అడవి గాడిద ఎలాగైతే ఒక మనిషికి జన్మ ఇవ్వలేదో, అలాగే బుద్ధిహినుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు. |
13
|
“అయితే యోబూ! దేవుణ్ణి మాత్రమే సేవించటానికి, నీవు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆయన తట్టు నీవు నీ చేతులు ఎత్తి ఆరాధించాలి. |
14
|
నీ ఇంట్లో ఉన్న పాపం నీవు తొలగించి వేయాలి. నీ గుడారంలో చెడు నివాసం చేయనియ్యకు. |
15
|
అప్పుడు నీవు సిగ్గుపడకుండా దేవుని తట్టు నిశ్చలంగా చూడగలుగుతావు. నీవు బలంగా నిలబడతావు. భయపడవు. |
16
|
యోబూ! అప్పుడు నీవు నీ కష్టం మరచిపోగలవు. నీ కషాలను దొర్లిపోయిన నీళ్లలా నీవు జ్ఞాపకం చేసుకొంటావు. |
17
|
అప్పుడు మధ్యాహ్నపు సూర్యకాంతి కంటె నీ జీవితం ఎక్కువ ప్రకాశమానంగా ఉంటుంది. జీవితపు గాఢాంధకార ఘడియలు సూర్యోదయంలా ప్రకాశిస్తాయి. |
18
|
యోబూ! నిరీక్షణ ఉంది గనుక నీవు క్షేమంగా ఉంటావు. దేవుడు నిన్ను సురక్షితంగా వుంచి నీకు విశ్రాంతినిస్తాడు. |
19
|
నీవు విశ్రాంతిగా పండుకొంటావు. నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, బాధించరు. మరియు అనేక మంది నీ సహాయం వేడుకొంటారు. |
20
|
కానీ, చెడ్డవాళ్లు సహాయం కోసం చూస్తారు, అయితే ఆశ ఏమి ఉండదు. వారు వారి కష్టాలు తప్పించుకోలేరు. వారు చస్తారు అనేది ఒక్కటే వారికి ఉన్న ఆశ.” |
Job 11:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...